దేశవ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వల పెంపు, సరఫరా, లభ్యత పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో పిఎస్‌ఎ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పురోగతి గురించి అధికారులు ప్రధాని మోదీకి వివరించారు. దేశవ్యాప్తంగా 1500కి పైగా పిఎస్‌ఎ ఆక్సిజన్ ప్లాంట్లు వస్తున్నాయని, ఇవి పీఎం కేర్స్ నిధులు, వివిధ మంత్రిత్వ శాఖలు మరియు పిఎస్‌యుల సహకారంతో ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు జిల్లాల్లో పీఎం కేర్స్ తో ఏర్పాటు చేసే పిఎస్ఎ ఆక్సిజన్ ప్లాంట్లు ద్వారా 4 లక్షలకు పైగా ఆక్సిజనేటెడ్ పడకలకు ఆక్సిజన్ అందించేందుకు వీలవుతుందని చెప్పారు. ఈ ప్లాంట్లు త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడాలని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్లను వేగంగా ట్రాక్ చేయడం గురించి రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నట్లు అధికారులు ప్రధానికి తెలియజేశారు.
అలాగే ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్వహణపై ఆసుపత్రి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారు. ప్రతి జిల్లాలో శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సూచించగా, నిపుణులు తయారుచేసిన శిక్షణా మాడ్యూల్ ఉందని, దేశవ్యాప్తంగా సుమారు 8000 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. స్థానిక మరియు జాతీయ స్థాయిలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ల పనితీరు మరియు పెర్ఫార్మన్స్ గురించి తెలుసుకోవడానికి ఐఓటి వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో పీఎం ప్రధాన కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ