దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో అమిత్ షా, డాక్టర్ హర్ష్ వర్ధన్, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్,పియూష్ గోయల్, మన్సుఖ్ మాండవియా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న వివిధ రాష్ట్రాలు మరియు జిల్లాల్లో పరిస్థితిని అధికారులు ప్రధానికి వివరించారు. అలాగే ప్రస్తుతం 1 లక్షకు పైగా యాక్టీవ్ కరోనా కేసులు ఉన్న 12 రాష్ట్రాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ హెల్త్ కేర్ కు సంబంధించి మౌలిక సదుపాయాలను పెంచడానికి రాష్ట్రాలకు సహాయం మరియు మార్గదర్శకత్వం ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కరోనా పాజిటివిటీ రేటు 10% లేదా అంతకంటే ఎక్కువ ఉన్న జిల్లాలు, ఆక్సిజన్ సపోర్ట్ లేదా ఐసీయూ పడకలపై బెడ్ ఆక్యుపెన్సీ 60% కంటే ఎక్కువఉన్న జిల్లాలను గుర్తించి, చర్యలు తీసుకోవడంపై రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసిన విషయాన్ని ప్రధాని గుర్తించారు. అలాగే ఔషదాల లభ్యతపై సమీక్షించారు. రెమ్‌డెసివిర్‌తో సహా ఔషదాల ఉత్పత్తి వేగవంతం చేయడంపై చర్చించారు.
లాక్‌డౌన్ ఉన్నప్పటికీ పౌరులు వ్యాక్సిన్ పొందేందుకు రాష్ట్రాలు ఏర్పాట్లు చేయాలి:
రాబోయే కొద్ది నెలల్లో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడం మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కూడా ప్రధాని సమీక్షించారు. రాష్ట్రాలకు ఇప్పటివరకు సుమారు 17.7 కోట్ల వ్యాక్సిన్స్ సరఫరా చేసినట్లు అధికారుల తెలిపారు. వ్యాక్సిన్ వృధాపై రాష్ట్రాల వారీగా వివరాలను కూడా ప్రధాని సమీక్షించారు. ఇప్పటికి 45 ఏళ్లు పైబడి అర్హత కలిగిన జనాభాలో 31% మందికి కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్ ఇవ్వబడిందని అధికారులు తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ లో వేగం తగ్గకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని, ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ పౌరులు వ్యాక్సిన్ పొందేందుకు రాష్ట్రాలు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే కరోనా వ్యాక్సినేషన్ లో విధులు నిర్వహిస్తున్న పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలను ఇతర విధుల కోసం మళ్లించకూడదని రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ