కోవిడ్ అవుట్ పేషంట్ సర్వీసుల నిర్వహణను తనిఖీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్

Telangana CS Somesh Kumar Inspected Covid Out Patient Services at Boggulakunta Urban PHC,Mango News,Mango News Telugu,Telangana CS Somesh Kumar,CS Somesh Kumar,Somesh Kumar,Telangana CS Somesh Kumar Live,CS Somesh Kumar Live News,CS Somesh Kumar Live Updates,CS Somesh Kumar Pressmeet Live,CS Somesh Kumar Pressmeet,CS Somesh Kumar Latest News,CS Somesh Kumar News,Telangana CS Press Meet,Covid-19,Covid-19 In Telangana,Telangana Covid-19 Updates,Telangana Coronavirus Latest Updates,CS Somesh Kumar Inspected Covid Out Patient Services,Covid Out Patient Services At Boggulakunta Urban PHC,Boggulakunta Urban PHC,Telangana CS visits Boggulakunta Urban Primary Health Centre,Boggulakunta Urban Primary Health Centre,CS Somesh Kumar Inspected Boggulakunta Urban PHC

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు బొగ్గులకుంట అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శనలో కోవిడ్ అవుట్ పేషంట్ సర్వీసుల నిర్వహణలను తనిఖీ చేసారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లలో కోవిడ్ ఓపి సర్వీసులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను సందర్శించి ఓపి నిర్వహణకు చేసిన ఏర్పాట్ల విషయమై తెలుసుకున్నారు. రెగ్యులర్ సర్వీసులను హెల్త్ సెంటర్ లో అందిస్తూ కోవిడ్ ఓపి సర్వీసులను సమీపంలోని కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్నామని డాక్టర్లు సీఎస్ కి తెలిపారు. రద్ధీ నివారణకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు.

లక్షణాలు ఉన్నవారికి రిపోర్టు కోసం ఆగకుండా వెంటనే మందుల కిట్ ను అందించి చికిత్సను ప్రారంభించాలన్నారు. మందులు వాడాకా జ్వరం నాలుగు, ఐదు రోజుల పాటు ఉంటే స్టిరాయిడ్ ను వాడాలని దీనివలన ఆసుపత్రులలో చేరికను నివారించడం జరుగుతుందన్నారు. స్వల్ప జ్వర లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రులలో ఓపి చికిత్సకు హాజరై, ఉచితంగా అందజేసే మందులను వాడాలని సీఎస్ అన్నారు. జ్వర లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులు, సలహాలు, సూచనలను సీఎస్ స్వయంగా పరిశీలించారు. ఈ తనిఖీలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, జోనల్ కమీషనర్ ప్రావిణ్య, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =