కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

coronavirus vaccine, Covid-19 Vaccination, Mango News, Modi takes homegrown COVID jab, PM Modi gets first dose of Covid-19 vaccine Covaxin, PM Modi takes first dose of Covid-19 vaccine, pm narendra modi, PM Narendra Modi Took Covid-19 Vaccine, PM Narendra Modi Took Covid-19 Vaccine at AIIMS Delhi, PM Narendra Modi Took his First Dose of Covid-19 Vaccine

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ తోలి డోసును ప్రధాని మోదీ తీసుకున్నారు. ‌ఎయిమ్స్ లో విధులు నిర్వహిస్తున్న పుదుచ్చేరికి చెందిన సిస్టర్‌ పి.నివేదా ప్రధాని మోదీకి వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం తాను కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ఎయిమ్స్ లో మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాను. కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచపోరాటాన్ని బలోపేతం చేయడానికి మన వైద్యులు మరియు శాస్త్రవేత్తలు త్వరితగతిన చేసిన కృషి చెప్పుకోదగినది. అర్హత ఉన్న వారందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మనమంతా కలిసి భారతదేశాన్ని కరోనా రహిత దేశంగా మారుద్దాం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

దేశంలో రెండోవిడత కరోనావ్యాక్సిన్ పంపిణీలో భాగంగా ఈరోజు నుంచి (మార్చి 1, సోమవారం) 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులుతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. అందులో భాగంగానే నేడు ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో విడత వ్యాక్సిన్ పంపిణీ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో వ్యక్తికీ ఒక్కో డోసుకు ధరను రూ.250గా నిర్ణయించారు. ఇందులో సర్వీస్‌ ఛార్జిగా రూ.100, వ్యాక్సిన్‌ డోసు ధరను రూ.150 గా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ