ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 16న నేపాల్ దేశంలో పర్యటించనున్నారు. నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు బుద్ధ పూర్ణిమ సందర్భంగా మే 16, సోమవారం నాడు నేపాల్ లోని లుంబినీలో ప్రధాని మోదీ అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా 2014 నుంచి ప్రధాని మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది ఐదవసారి. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ లుంబినీలోని పవిత్ర మాయాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు.
నేపాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో లుంబినీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ నిర్వహించే బుద్ధ జయంతి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే బౌద్ధ సంస్కృతి మరియు వారసత్వ కేంద్ర నిర్మాణానికి సంబంధించిన “శిలాన్యాస్” వేడుకలో ప్రధాని పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఇరువురు ప్రధానమంత్రులు మధ్య ఒక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. పొరుగుదేశాలకు మొదట ప్రాధాన్యత విధానానికి అనుగుణంగా భారతదేశం మరియు నేపాల్ మధ్య ఉన్నత స్థాయి మార్పిడి సంప్రదాయాన్ని తాజా ప్రధాని మోదీ పర్యటన కొనసాగించనుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF