రేపు ఢిల్లీలో నేషనల్ ఫ్లాట్ ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 3వ సెషన్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi will Inaugurate 3rd Session of National Platform for Disaster Risk Reduction at New Delhi on 10th March,PM Modi will Inaugurate 3rd Session,National Platform for Disaster Risk Reduction,Risk Reduction at New Delhi on 10th March,Mango News,Mango News Telugu,PM to inaugurate 3rd Session,PM Modi to participate in 3rd Session,Indian Prime Minister Narendra Modi,Narendra modi Latest News and Updates,Indian Political News, National Political News

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (మార్చి 10, శుక్రవారం) సాయంత్రం 4:30 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నేషనల్ ఫ్లాట్ ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (ఎన్పీడీఆర్ఆర్)/విపత్తు ప్రమాద తగ్గింపు జాతీయ వేదిక యొక్క 3వ సెషన్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క 3వ సెషన్ యొక్క ప్రధాన థీమ్ ను “బిల్డింగ్ లోకల్ రెజిలెయన్స్ ఇన్ ఏ ఛేంజింగ్ క్లైమేట్/మారుతున్న వాతావరణంలో స్థానిక స్థితిస్థాపకతను నిర్మించడం” గా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డు గ్రహీతలను ప్రధాని మోదీ సన్మానించనున్నారు. ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ మరియు మిజోరాంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్ 2023 పురస్కార్ విజేతలుగా నిలిచారు

ఎన్పీడీఆర్ఆర్ అనేది డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రంగంలో సంభాషణలు, అనుభవాలు, అభిప్రాయాలు, ఆలోచనలు, చర్య-ఆధారిత పరిశోధన మరియు అవకాశాలను అన్వేషించడం వంటి వాటిని సులభతరం చేయడానికి భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన బహుళ-స్టేక్‌హోల్డర్ ప్లాట్‌ఫారమ్. ఈ సందర్భంగా డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రంగంలో వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలు, సాధనాలు మరియు సాంకేతికతలను ప్రదర్శించే ప్రదర్శనను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 12 =