భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛాతీలో అసౌకర్యం కారణంగా శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్అండ్ఆర్) ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించి, అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు నిన్న ఆర్మీ ఆసుపత్రి మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. అయితే తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఆరోగ్యంపై రాష్ట్రపతి భవన్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్య పరీక్షలు అనంతరం బైపాస్ సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారని, మార్చి 30, మంగళవారం ఉదయం ఎయిమ్స్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ జరిగే అవకాశముందని ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రపతి ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన ఎయిమ్స్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ






































