తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు, ప్రధాని మోదీ ట్వీట్

PM Modi Informed PM MITRA Mega Textile Parks will Set up in Telangana Tamil Nadu Karnataka Maharashtra Gujarat MP and UP,PM Modi Informed PM MITRA,PM MITRA Mega Textile Parks,Mega Textile Parks will Set up in Telangana,Mega Textile Parks will Set up in Tamil Nadu,Mango News,Mango News Telugu,PM MITRA in Karnataka and Maharashtra,Gujarat MP and UP Mega Textile Parks,Indian Prime Minister Narendra Modi,Latest Indian Political News,Narendra Modi Latest News and Updates,PM MITRA Latest News,PM MITRA Latest and Live Updates

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో 5ఎఫ్ విజన్‌కు (ఫార్మ్->ఫైబర్->ఫ్యాక్టరీ-> ఫ్యాషన్-> ఫారిన్ వరకు) అనుగుణంగా టెక్స్‌టైల్స్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్కులు టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని ప్రధాని తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

“పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్కులు 5ఎఫ్ విజన్‌కు అనుగుణంగా టెక్స్‌టైల్స్ రంగాన్ని పెంచుతాయి. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఎంపీ, యూపీలలో పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు కానున్నాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఇది మేక్ ఇన్ ఇండియా మరియు మేక్ ఫర్ ది వరల్డ్ కి గొప్ప ఉదాహరణ అవుతుంది” అని ప్రధాని మోదీ తెలిపారు.

ప్రధాని మోదీ ప్రకటనపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పందిస్తూ, “లక్షలాదిమంది రైతులకు, చేనేత కార్మికులకు ఉపయోగపడే, వేలాదిమంది యువతకు ఉద్యోగాలను అందించే మెగా టెక్స్‌టైల్స్ పార్కును తెలంగాణకు ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి యావత్ తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here