ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అధికార పక్షం టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు పాటు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు కూడా యశ్వంత్ నామినేషన్ కార్యక్రమానికి హాజరవనున్నారు.
అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించేందుకు న్యూఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌లు ఏర్పాటు చేసిన రెండు సమావేశాలకు టీఆర్‌ఎస్ గైర్హాజరవడంతో ఆ పార్టీ ఎటువైపు స్టాండ్ తీసుకుంటుందనే అనుమానాలు రాజకీయ వర్గాలలో వెలుగు చూశాయి. కానీ వీటికి చెక్ పెడుతూ.. ఈరోజు జరుగనున్న యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీకి, అలాగే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయ రాజకీయాలలో తనదైన ముద్ర వేసేందుకు సరికొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అడుగులు ఎలా ఉండనున్నాయని వైపు ఇతర పార్టీలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ క్రమంలో విపక్షాల అభ్యర్థి సిన్హాకు మద్దతు తెలుపుతూ సీఎం కేసీఆర్ నిర్ణయించుకోవడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY