అమరావతిలో ల్యాండ్స్‌‌ అమ్మకానికి సీఆర్‌డీఏ ప్రతిపాదన.. జీఓ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt Issues GO Regarding The Proposal of CRDA To Auction Lands in Amaravati, GO Regarding The Proposal of CRDA To Auction Lands in Amaravati, Proposal of CRDA To Auction Lands in Amaravati, CRDA To Auction Lands in Amaravati, CRDA To Auction Amaravati Lands, Amaravati Lands, CRDA To Auction, Amaravati Lands Auction, AP Govt Issues GO, State government has given green signal for CRDA to auction the lands in Amaravati, green signal for CRDA to auction the lands in Amaravati, CRDA auction, AP Govt, Amaravati Lands Auction News, Amaravati Lands Auction Latest News, Amaravati Lands Auction Latest Updates, Amaravati Lands Auction Live Updates, Mango News, Mango News Telugu,

ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర రాజధాని నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు దాదాపు రూ.2,500 కోట్ల నిధులను సమీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అమరావతిలో 248.30 ఎకరాల భూమిని వేలం వేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. సీఆర్‌డీఏ 2016లో అమరావతిలో 100 ఎకరాలకు పైగా భూమిని మెడిసిటీ ఏర్పాటు కోసం బీఆర్ శెట్టి గ్రూప్‌కు మరియు ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు కింగ్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఏర్పాటు కోసం మరో 148.28 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఈ కేటాయింపులు రద్దు కావడంతో ఆ భూములు ఖాళీగా ఉన్నాయి. సీఆర్‌డీఏ తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ భూములను అమ్మకానికి పెడుతున్నట్లు అధికార వర్గాల సమాచారం.

ఈ క్రమంలో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు పలు షరతులు విధించడంతో భూముల విక్రయం చేపట్టి అభివృద్ధి చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయానికి వచ్చింది. ఏడాదికి 50 ఎకరాల చొప్పున మొత్తం 600 ఎకరాల వరకు విక్రయించాలని సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా తొలివిడతలో 248.34 ఎకరాలను సీఆర్‌డీఏ విక్రయించనున్నది. ఒక్కొక్క ఎకరం రూ.10 కోట్లకు విక్రయించడం ద్వారా రూ. 2,480 కోట్లు సమీకరించాలని భావిస్తున్నది. కాగా, భూములు విక్రయించగా వచ్చిన ఆదాయంతో కేవలం రాజధాని అభివృద్ధి పనులు మాత్రమే చేయాలని, దానిని మరి ఏ ఇతర అవసరాలకు వాడరాదని హైకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీంతో ఈ నిధులతో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఈ మేరకు 389 నంబర్‌ జీఓను ప్రభుత్వం విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 12 =