75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుగా రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించి, ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోటపై ప్రధాని హోదాలో మోదీ 8వసారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జాతీనుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దేశ ప్రజలలో కొత్త శక్తిని మరియు కొత్త చైతన్యాన్ని నింపాలని కోరుకున్నారు. అలాగే ఈ వేడుకకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, భారత సైన్యం, నేవీ, వైమానిక దళం అధికారులు, ఎన్సీసీ క్యాడెట్స్, టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్లు, పలువురు ప్రముఖులు, విద్యార్థులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ