బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, రెండ్రోజుల పర్యటన

Bangladesh, Mango News, Modi in Bangladesh LIVE updates, Modi Two-day Visit to Bangladesh, Narendra Modi, Narendra Modi Two-day Visit to Bangladesh Begins, Narendra Modi Two-day Visit to Bangladesh Begins Today, PM Modi begins 2-day visit to Bangladesh, PM Modi leaves for Bangladesh on two-day visit, PM Modi to begin two-day visit to Bangladesh, PM Narendra Modi in Bangladesh Live Updates, Prime Minister Narendra Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. డాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ దేశ ప్రధాని షేక్ హసీనా స్వాగతం పలికారు. మార్చి 26, 27 తేదీల్లో రెండ్రోజుల పాటుగా ప్రధాని బంగ్లాదేశ్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం జరిగే బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరు కానున్నారు.

అలాగే సాయంత్రం బాపు బంగబందు డిజిటల్ వీడియో ఎగ్జిబిషన్ కు ప్రారంభోత్సవం చేస్తారు. మరోవైపు ఈ పర్యటనలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక సంప్రదింపులు జరపడంతో పాటుగా బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎండి.అబ్దుల్ హమీద్, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె.అబ్దుల్ మోమెన్ తో సమావేశాలు జరగనున్నాయి. గత సంవత్సరం కరోనా మహమ్మారి వ్యాప్తి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ ఎలాంటి విదేశీ పర్యటనలు చేపట్టలేదు. కరోనా మహమ్మారి అనంతరం తోలి విదేశీ పర్యటనగా బంగ్లాదేశ్ కు వెళ్లారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య మరింత బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు దోహదం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ