పరీక్షల విధానంపై సీఎం జగన్ కీలక నిర్ణయం, అన్ని కాలేజీలకు ఒకే రకమైన విధానం అమలు

andhra pradesh chief minister, Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, Andhra Pradesh Government cancels self-exams, Autonomous colleges cannot set their own exam papers, CM YS Jagan, CM YS Jagan Held Review over Examination Pattern, CM YS Jagan Held Review over Examination Pattern in Autonomous Colleges, JNTU to prepare question papers for all colleges, Mango News, Review over Examination Pattern in Autonomous Colleges, YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి విద్యారంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం నాడు రాష్ట్రంలోని అటానమస్‌ కాలేజీల్లో పరీక్ష విధానంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అటానమస్‌ కాలేజీలలో సొంతంగా ప్రశ్న పత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేస్తునట్టు తెలిపారు. అటానమస్‌ మరియు నాన్‌ అటానమస్‌ కాలేజీలలో ఇకనుంచి ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షలు నిర్వహించడం, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వ యూనివర్సిటీలకే అప్పగిస్తునట్టు ప్రకటించారు. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు చోటులేకుండా రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కాలేజీలకు ఒకే రకమైన పరీక్షల విధానం అమలు చేయాలని చెప్పారు.

ఇకపై జేఎన్‌టీయూల్లో తయారుచేసిన ప్రశ్నాపత్రాలే అన్ని కాలేజీల్లో వినియోగించనున్నారు. విద్యార్థులు డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలని, నైపుణ్యం రావాలంటే పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరోవైపు ఏప్రిల్‌ 9న జరిగే జగనన్న విద్యా దీవెన, ఏప్రిల్‌ 27న జరిగే జగనన్న వసతి దీవెన పథకాలపై కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద హాస్టల్ మరియు భోజన ఖర్చుల విడుదలపై చర్చించి, అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. ఈ సంవత్సరం నుంచి తల్లుల బ్యాంక్ ఖాతాల్లోనే విద్యా దీవెన డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =