దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పంజాబ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుండే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే అధికార కాంగ్రెస్ పార్టీకి ‘ఆప్’ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది.
- మొత్తం 117 సీట్లు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో అధికారానికి కావాల్సిన మేజిక్ మార్క్ 59.
- ఇప్పటికే ‘ఆప్’ పార్టీ 88 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
- కాంగ్రెస్ 13, అకాలీలు 11, బీజేపీ, మిత్రపక్షాలు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
- కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు స్థానాల్లో పోటీ చేయగా.. రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
- అలాగే, పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు కూడా అమృత్‌సర్ ఈస్ట్ స్థానంలో వెనుకంజలో ఉన్నారు.
- మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు.
- ‘ఆప్’ పార్టీ సీఎం అభ్యర్థి ‘భగవంత్ మాన్’ అద్భుత విజయం దిశగా దూసుకుపోతున్నారు.
ఢిల్లీలో అధికారంలో ఉన్న ‘ఆప్’ పార్టీ ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో అధికారం చేపట్టటం ద్వారా తన అధికారాన్ని క్రమంగా విస్తరించుకుంటోంది. ఈ తాజా విజయంతో ‘ఆప్’ పార్టీ కార్యాలయాల వద్ద అభిమానులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ‘ఆప్’ స్థానాలు మరికొన్ని పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ