కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’, పాల్గొన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ

Congress Interm President Sonia Gandhi Joins Rahul's Bharat Jodo Yatra Resumes From Mandya Karnataka Today, Bharat Jodo Yatra Mandya Karnataka Today, Sonia Gandhi Joins Rahul's Bharat Jodo Yatra, Congress Interm President Sonia Gandhi, Bharat Jodo Yatra, Congress Bharat Jodo Yatra , Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Bharat Jodo Yatra, Mango News, Mango News Telugu, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi , Rajiv Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi, Rahul Gandhi Latest News And Updates

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు తిరిగి ప్రారంభించబడిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కర్ణాటకలోని మాండ్యలో కొనసాగుతున్న పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు ఆమె కొద్దిదూరం నడువనున్నారు. దసరా పండుగ సందర్భంగా రెండు రోజుల విరామం అనంతరం గురువారం మాండ్య తాలూకా పాండవపుర నుంచి యాత్ర తిరిగి ప్రారంభమైంది. గత నెల మొదటి వారంలో కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 30న కర్ణాటకలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని నెలలుగా పలు అనారోగ్య సమస్యల కారణంగా సోనియా గాంధీ ఇప్పటివరకు ఈ పాదయాత్రలో పాల్గొనలేకపోయారు. అలాగే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆమె పార్టీకి సంబంధించిన పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొనడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో సోనియా గాంధీ సోమవారం మైసూరుకు చేరుకున్నారు. అనంతరం రెండు రోజుల పాటు ప్రముఖ హిల్ స్టేషన్ కూర్గ్‌లో విశ్రాంతి తీసుకుని ఈరోజు పాదయాత్ర వద్దకు చేరుకున్నారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ కూడా మంగళవారం నాగర్‌హోళె టైగర్ రిజర్వ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వ్ ఫారెస్ట్‌లో గాయపడిన ఏనుగు పిల్ల గురించి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దృష్టికి తీసుకెళ్లారు. సందర్శన తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా గాయపడిన ఏనుగు పిల్ల కోసం చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ బొమ్మైకి గాంధీ లేఖను జత చేస్తూ ట్వీట్ చేశారు. కాగా ఈ పాదయాత్ర మరో మూడు వారాల పాటు కర్ణాటక రాష్ట్రంలో కొనసాగనుంది. అనంతరం అక్టోబర్ చివరి వారంలో రాహులా గాంధీ తెలంగాణలో అడుగిడనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here