గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: హంగ్ దిశగా రిజల్ట్స్.. బీజేపీకే అవకాశం?

Goa Assembly Election Results 2022 Results Towards Hung, Goa Assembly Election Results 2022 Live Updates, Poll Results of Goa, Poll Results of Goa 2022 Assembly Elections, Counting of Votes 2022 Assembly Elections Results Live Updates, Assembly Elections-2022, Goa Assembly Election Results 2022, Election 2022, Assembly Election, Assembly Election 2022, 2022 Assembly Election, Assembly Elections, Assembly Elections Latest News, Assembly Elections Latest Updates, Assembly Elections Live Updates, 2022 Assembly Elections, Assembly Elections, Elections, Mango News, Mango News Telugu,

దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. దేశంలోనే చిన్నదైన గోవా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించడంలేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే ఇక్కడ రిజల్ట్స్ హంగ్ దిశగా నడుస్తున్నాయి. రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. గోవాలో ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి.

బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. 2017లో, కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది, అయితే 13 సీట్లు గెలుచుకున్న బీజేపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ మరియు MGP తలా మూడు సీట్లు గెలుచుకున్న MGP మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. బీజేపీ గోవా సిట్టింగ్‌ సీఎం ప్రమోద్‌ సావంత్‌ మంగళవారం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలతో భేటీ అయ్యారు. గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పొందేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన వారితో చర్చించారు.

  • 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ – 21
  • బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
  • సీఎం ప్రమోద్‌ సావంత్‌ ముందంజలో ఉన్నారు.
  • కాంగ్రెస్ 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
  • ఆప్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యం చూపుతోంది.
  • ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
  • ఉత్పల్ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం వైపుగా దూసుకుపోతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + two =