మేలో రూ.1,40,885 కోట్ల జీఎస్టీ వసూళ్లు, గతఏడాదితో పోలిస్తే ఏపీలో 47%, తెలంగాణలో 33% పెరుగుదల

GST Revenue Collection RS 140885 Cr Reported in May Month, RS 140885 Cr Reported in May Month, gross revenue from Goods and Service Tax in the month of May came in at Rs 140885 crore, gross revenue from GST in the month of May came in at Rs 140885 crore, This is the fourth time the monthly GST collection crossed Rs 1.40 lakh crore mark, monthly GST collection crossed Rs 1.40 lakh crore mark, Goods and Service Tax revenue collection for May jumps 44 percent, GST Revenue, Goods and Service Tax Revenue, Goods and Service Tax Revenue Collection, GST Revenue Collection News, GST Revenue Collection Latest News, GST Revenue Collection Latest Updates, GST Revenue Collection Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో మే నెలలో రూ.1,40,885 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ ప్రారంభమైనప్పటి రూ.1.40 లక్షల కోట్ల మార్కు దాటడం ఇది 4వసారి కాగా, 2022 మార్చి, ఏప్రిల్, మేలలో వరుసగా రూ.1.40 లక్షల కోట్లకు పైగానే జీఎస్టీ వసూళ్ల సేకరణ జరిగిందని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. ఆర్థిక సంవత్సరం మొదటి నెల అయిన ఏప్రిల్‌, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలతో పోల్చితే మే నెలలో జీఎస్టీ సేకరణ ఎల్లప్పుడూ కొంత తక్కువగా ఉంటుందని, అయితే మే 2022లో కూడా స్థూల జీఎస్టీ రాబడులు రూ.1.40 లక్షల కోట్ల మార్కును అధిగమించడం ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు. మరోవైపు మే 2022లో నమోదైన జీఎస్టీ వసూళ్లు మే 2021 కంటే 44% ఎక్కువని పేర్కొన్నారు.

గతఏడాదితో పోలిస్తే ఏపీలో 47%, తెలంగాణలో 33% పెరుగుదల:

మే నెలలో సీజీఎస్టీ వసూళ్లు రూ.25,036 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.32,001 కోట్లు, ఐజీఎస్టీ రూ.73,345 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ. 37469 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ.10,502 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.931 కోట్లతో కలిపి) గా నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది మేలో జీఎస్టీ వసూళ్లతో (రూ.2,074 కోట్లు) పోలిస్తే ఈ ఏడాది మేలో (రూ.3,047 కోట్లు) 47 శాతం పెరిగాయి. అలాగే తెలంగాణలో 2021 మేలో రూ.2,984 కోట్లు వసూలు కాగా, 2022 మేలో 33 శాతం పెరుగుదలతో రూ.3,982 కోట్లు వసూలు అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =