కరోనా వ్యాక్సిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన, త‌న కుమార్తె కి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వెల్లడి

President Putin Daughter Gets Vaccinated, Russia Announces Covid-19 Vaccine, Russia Announces First Covid-19 Vaccine, Russia announces world first Covid-19 vaccine, Russia approves world first coronavirus vaccine, Russia Corona Vaccine, Russia Covid-19 Vaccine, Russia Covid-19 Vaccine Latest News Update

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి కోసం పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను క‌నుగొన్న‌ట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రకటించారు. ప్ర‌పంచంలో కోవిడ్-19 (కరోనావైరస్) కు వ్యాక్సిన్ తయారీ చేసిన తొలిదేశంగా రష్యా నిలిచిందని, ర‌ష్యా ఆరోగ్య శాఖ ఈ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపినట్లు పుతిన్ వెల్లడించారు. గ‌మేలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మరియు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. వ్యాక్సిన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురాస్కోను పుతిన్ ఆదేశించారు.

మరోవైపు ప్రయోగంలో భాగంగా త‌న కూతురికి కూడా వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్లు పుతిన్ తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చాక త‌న కూతురి శ‌రీరంలో స్వ‌ల్ప‌లంగా ఉష్ణోగ్ర‌త‌లు పెరిగాయని, కానీ త్వరగానే ఆమె సాధార‌ణ స్థాయికి వచ్చినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని, స్థిరమైన రోగనిరోధక శక్తిని ఏర్పరుస్తుందని తాజాగా నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నట్టు తెలుస్తుంది. రష్యా అధికార వర్గాల ప్రకారం సెప్టెంబ‌ర్ నుంచి హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు, జ‌న‌వ‌రి నుంచి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉండనున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu