శ్రీ అరబిందో 150వ జయంతి: స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన ప్రధాని మోదీ

Sri Aurobindo’s 150th Birth Anniversary: PM Modi Releases Commemorative Coin and Postal Stamp,Sri Aurobindo 150Th Birth Anniversary,Modi Releases Commemorative Coin,Aurobindo Postage Stamp,Mango News,Mango News Telugu,Sri Aurobindo Birth Anniversary,Aurobindo Pharma,Sri Aurobindo,Pm Modi Pays Tributes To Sri Aurobindo,Sri Aurobindo Ashram,Aurobindo Pharma Ltd,Aurobindo Tablets,Aurobindo Pharma News,Aurobindo Pharma Products List,Aurobindo Pharma Unit List,Birth Anniversary Of Sri Aurobindo,Sri Aurobindo Birthday 2022

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పుదుచ్చేరిలోని కంబన్ కలై సంగమ్‌లో మంగళవారం సాయంత్రం శ్రీ అరబిందో 150వ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతీయ తత్వవేత్త, యోగి, కవి, భారతీయ జాతీయవాది శ్రీ అరబిందో గౌరవార్థం స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంపును కూడా ప్రధాని మోదీ విడుదల చేశారు. అనంతరం ప్ర‌ధాని ప్ర‌సంగిస్తూ, అర‌బిందో 150వ జ‌యంతి ఉత్స‌వాన్ని ఏడాది పొడవునా ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకోవాల‌న‌డం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంప్‌ ను విడుదల చేయడం ద్వారా దేశం అరబిందోకు నివాళులర్పిస్తున్నదని ప్రధాని అన్నారు. దేశం యొక్క ఇటువంటి ప్రయత్నాలు భారతదేశ తీర్మానాలకు కొత్త శక్తిని మరియు బలాన్ని ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

అనేక గొప్ప కార్య‌క్ర‌మాలు ఏక‌కాలంలో జ‌ర‌గ‌డం గ‌మ‌నిస్తే, వాటి వెనుక స‌మిష్టిగా, ఏకం చేసే శ‌క్తి అయిన ‘యోగా-శక్తి’ తరచుగా ఉంటుంద‌ని ప్ర‌ధాని అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి దోహదపడడమే కాకుండా జాతి ఆత్మకు కొత్త జీవితాన్ని అందించిన ఎందరో మహానుభావులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. వారిలో ముగ్గురు వ్యక్తులు శ్రీ అరబిందో, స్వామి వివేకానంద మరియు మహాత్మా గాంధీ వారి జీవితంలో ఒకే సమయంలో అనేక గొప్ప సంఘటనలు జరిగాయన్నారు. ఈ సంఘటనలు ఈ వ్యక్తుల జీవితాలను మార్చడమే కాకుండా జాతీయ జీవితంలో సుదూర మార్పులను తీసుకువచ్చాయి. 1893లో శ్రీ అరబిందో భారతదేశానికి తిరిగి వచ్చారని, అదే సంవత్సరంలో స్వామి వివేకానంద వరల్డ్ పార్లమెంట్‌ ఆఫ్ రిలీజియన్స్ లో తన దిగ్గజ ప్రసంగం చేసేందుకు అమెరికా వెళ్లారని ప్రధాని వివరించారు. గాంధీజీ అదే సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు వెళ్లారని, ఇది ఆయన మహాత్మా గాంధీగా రూపాంతరం చెందడానికి నాంది పలికిందని తెలిపారు. శ్రీ అరబిందో 150వ జయంతి, నేతాజీ సుభాస్ 125వ జయంతి సందర్భంగా దేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న ప్రస్తుత కాలంలో, అమృత్‌కాల్‌ యాత్రను ప్రారంభిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనల సంగమాన్ని ప్రధాని గుర్తు చేశారు. “ప్రేరణ మరియు చర్య కలిసినప్పుడు, అసాధ్యమైన లక్ష్యం కూడా అనివార్యంగా సాధించబడుతుంది. ఈ రోజు అమృత్ కాల్‌లో దేశం సాధించిన విజయాలు మరియు ‘సబ్కా ప్రయాస్’ తీర్మానం దీనికి నిదర్శనం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

శ్రీ అరబిందో బెంగాల్‌లో జన్మించి గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, హిందీ మరియు సంస్కృతంతో సహా అనేక భాషలు తెలిసినందున ఆయన జీవితం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’కి ప్రతిబింబం, ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం గుజరాత్ మరియు పుదుచ్చేరిలో గడిపాడు మరియు ఆయన ఎక్కడికి వెళ్లినా లోతైన ముద్ర వేసాడు. శ్రీ అరబిందో బోధనలపై మాట్లాడుతూ, మనం మన సంప్రదాయాలు, సంస్కృతి గురించి తెలుసుకుని వాటి ద్వారా జీవించడం ప్రారంభించినప్పుడు, మన వైవిధ్యం మన జీవితాల్లో సహజమైన వేడుకగా మారుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆజాదీ కా అమృత్ కాల్‌కి ఇది గొప్ప ప్రేరణ. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌ను వివరించడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు అని ప్రధాని మోదీ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE