ప్రముఖ దర్శకుడు మణిరత్నం హాస్పిటల్‌లో చేరారు. అయితే ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. దీంతో ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆయన ఆరోగ్యం కొంచెం క్షీణించినట్లు అనిపించడంతో కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మణిరత్నం భార్య, ప్రముఖ నటి సుహాసిని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ అనే పీరియాడికల్ చిత్రం తీస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన నిర్వహించిన మొదటి భాగానికి సంబంధించిన టీజర్ లాంచింగ్‌కు మణిరత్నం హాజరయ్యారు. టీజర్ కు మంచి స్పందన కూడా వస్తోంది. ఈ సమయంలో ఆయన కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న తమిళ నటుడు విక్రమ్ కూడా అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ