ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బెంగళూరులో 108 అడుగుల శ్రీ నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి ప్రధాని మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఈ సందర్భంగా అక్కడ మొక్కను కూడా నాటారు. బెంగళూరు నగర స్థాపకుడైన నాడప్రభు కెంపేగౌడ బెంగళూరు అభివృద్ధికి చేసిన కృషికి గుర్తుగా ఈ విగ్రహాన్ని నిర్మించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫేమ్ రామ్ వి సుతార్ కాన్సెప్టైజ్ చేసి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. 98 టన్నుల కాంస్య మరియు 120 టన్నుల ఉక్కుతో ఈ విగ్రహాన్నీ ఏర్పాటు చేశారు. అలాగే నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్నీ ‘స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పిరిటీ’ గా పిలుస్తున్నారు.
ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “బెంగళూరు నిర్మాణంలో శ్రీ నాడప్రభు కెంపేగౌడ పాత్ర అసమానమైనది. ఎప్పుడూ ప్రజల సంక్షేమానికి అన్నింటికంటే ప్రాధాన్యత ఇచ్చిన దార్శనికుడిగా ఆయన గుర్తుండిపోతారు. బెంగళూరులో ‘స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పిరిటీ’ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE