ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ఛాంపియన్‌గా అర్జెంటీనా.. ఫైనల్‌లో మెరిసిన మెస్సీ సేన, ఫ్రాన్స్‌పై సంచలన విజయం

FIFA World Cup 2022 Argentina Beats France in Final To Crowned Champions For Third Time After 36 Years,Argentina Wins FIFA World Cup 2022,FIFA World Cup 2022 Final,FIFA Argentina and France Final,Argentina and France FIFA Final,Mango News,Mango News Telugu,Argentina Messi,France Mbappe,Argentina FIFA,France FIFA,World Cup 2022 Knockout Stage,FIFA World Cup Schedule,FIFA Knockout Bracket,FIFA World Cup,FIFA World Cup Schedule 2022,FIFA World Cup 2022 Schedule,2022 FIFA World Cup Qatar,2022 FIFA World Cup Knockout Stage,FIFA World Cup Qatar 2022,FIFA World

ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 ఛాంపియన్‌ ఎవరో తేలిపోయింది. ఆఖరి క్షణం వరకూ నువ్వా నేనా అన్నట్లు సాగిన హోరాహోరీ పోరులో చివరకు అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఫైనల్‌లో మెస్సీ సేన మాయ చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా సంచలన విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసిన ఫైనల్ పోరులో అర్జెంటీనా.. 4-2 తేడాతో ఫ్రాన్స్‌పై ఘన విజయం సాధించింది. దీంతో అర్జెంటీనా 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మూడో వరల్డ్‌కప్‌ టైటిల్‌ గెలుచుకుంది. ఇంతకుముందు 1978, 1986లో ఆ జట్టు ప్రతిష్టాత్మక ట్రోఫీ అందుకుంది. కాగా మూడు అంతకంటే ఎక్కువ వరల్డ్‌ కప్‌ టైటిల్స్ దక్కించుకున్న నాలుగో జట్టుగా నిలిచింది అర్జెంటీనా. అందరికంటే బ్రెజిల్‌ ఐదుసార్లు కప్ గెలవడం విశేషం. దాని తర్వాత జర్మనీ, ఇటలీ నాలుగుసార్లు కప్‌ సాధించాయి. ఇక ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ ఫుట్‌బాల్‌ ప్రేమికులకు జీవితాంతం గుర్తుండిపోయేలా నిలుస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఫస్టాఫ్‌లో అర్జెంటీనా దూకుడు.. సెకాండాఫ్‌లో చెలరేగిన ఫ్రాన్స్

ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపించింది. మ్యాచ్ 23వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కెప్టెన్ లియోనెల్ మెస్సీ అద్భుతమైన షాట్‌తో గోల్ సాధించాడు. దీంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. అనంతరం 36వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు ఏంజెల్ డీ మానా మరో గోల్ చేసి జట్టుకి 2-0 ఆధిక్యం అందించాడు. ఇక రెండో అర్ధ భాగంలో పుంజుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ఒక్కసారిగా రేసులోకొచ్చింది. 80వ నిమిషంలో లభించిన పెనాల్టీ అవకాశాన్ని ఎంబాపే సద్వినియోగం చేసుకుంటూ అద్భుత గోల్ చేశాడు. అనంతరం అర్జెంటీనా తేరుకొనేలోపే స్వల్ప వ్యవధిలోనే మరో గోల్‌ చేసి 2-2తో స్కోరు సమం చేశాడు. దీంతో స్టేడియంలో ఫ్రాన్స్ అభిమానుల ఆనందం అంబరాన్నంటింది.

ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ తేలని ఫలితం.. చివరకు పెనాల్టీ షూటౌట్‌

అయితే మ్యాచ్ ముగిసే వరకూ ఇరు జట్లూ 2-2 స్కోరుతో సమానంగా ఉండటంతో రిఫరీ 30 నిమిషాలు ఎక్స్‌ట్రా టైమ్‌ ఇచ్చారు. ఈ సమయంలో 108 నిమిషంలో అర్జెంటీనాకు పెనాల్టీ అవకాశం లభించగా మెస్సీ మరోసారి తన మాయాజాలం చూపాడు. అద్భుత కిక్ తో అర్జెంటీనా ఖాతాలో మరో గోల్ వేశాడు. దీంతో 3-2తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే దానికి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మ్యాచ్ 116వ నిమిషంలో మాంటెల్‌ చేతికి బంతి తగలడంతో ఫ్రాన్స్‌కు అనూహ్యంగా స్పాట్‌ కిక్‌ లభించింది. దీన్ని గోల్‌గా మలచిన ఎంబాపే 3-3తో స్కోరు సమం చేయడంతో.. ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఇరుజట్లు స్కోర్లు మరోసారి సమం కావడంతో చివరకు పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. అయితే పెనాల్టీ షూటౌట్‌లో ఒత్తిడిని అధిగమిస్తూ అర్జెంటీనా 4-2తో ఫ్రాన్స్‌ను చిత్తు చేసింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత విశ్వవిజేతగా నిలిచింది. ఎట్టకేలకు అర్జెంటీనా స్టార్ ప్లేయర్, కెప్టెన్ లియోనెల్ మెస్సీ కల నెరవేరింది. ఇక ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే టోర్నీలో అత్యధిక గోల్స్ చేసి ‘గోల్డెన్ బూట్’ అందుకున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + three =