సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా స్త్రీలకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. గురువారం జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బొప్పన్న, జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడికల్ టర్మినేషన్ కేసులో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు స్త్రీలకు ఉందని, పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్‌ను అడ్డుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ప్రతి మహిళ సురక్షితమైన అబార్షన్ చేసుకోవచ్చని, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేసుకునే హక్కు ఉందని తెలిపింది.
భారతదేశంలో అమలులో ఉన్న అబార్షన్ చట్టం ప్రకారం.. వివాహితులు, అవివాహిత స్త్రీలకు తేడా లేదని, గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేసుకోవచ్చని వెల్లడించింది. అలాగే అబార్షన్ విషయంలో మహిళలకు మరొకరి అనుమతి అవసరంలేదని కూడా స్పష్టం చేసింది. ఇంకా భర్త బలవంతంగా శృంగారం చేయడం వల్ల గర్భం వస్తే.. దానిని తొలగించుకునే హక్కు భార్యకు ఉంటుందని, అత్యాచార ఘటనలోనూ అబార్షన్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ఆధునిక కాలంలో చట్టం అనేది వ్యక్తుల హక్కులకు వివాహం ఒక ముందస్తు షరతు అనే భావనను కూడా తొలగిస్తోందని పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY