ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన.. ఆ నాలుగు సిరప్‌లపై విచారణకు ఆదేశాలు, అన్ని దేశాలకూ హెచ్చరికలు

World Health Organization Alerts Over Four Cough and Cold Syrups After 66 Children Lost Lives in Gambia, World Health Organization, WHO Alerts Over Four Cough and Cold Syrups, Promethazine Oral Solution, Cofexmalin Baby Cough Syrup, Macof Baby Cough Syrup , Magrip N Cold Syrup, 4 Syrups Banned By WHo, Mango News, Mango News Telugu, 66 Children Lost Lives in Gambia, Four Cough and Cold Syrups, WHO Latest News And Updates, World Health Organization News And Live Updates

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక ప్రకటన చేసింది. గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమంటూ నాలుగు సిరప్‌లపై విచారణకు ఆదేశించింది. కాగా ఈ నాలుగు ఔషధాలను తయారు చేసింది ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ కావడం ఇక్కడ గమనార్హం. ఈ సిరప్‌లను వాడరాదంటూ అన్ని దేశాలకూ హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘చిన్నారుల మరణం ఎంతో బాధాకరమన్న ఆయన, ఆ నాలుగు మందుల కారణంగానే చిన్నారులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాధమికంగా తేలిందని స్పష్టం చేశారు. ఈ నాలుగు మందులు భారతదేశంలో మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న దగ్గు మరియు జలుబు సిరప్‌లని తెలిపారు. దీంతో భారతదేశంలోని సంబంధిత కంపెనీ మరియు నియంత్రణ అధికారులతో డబ్ల్యూహెచ్‌ఓ విచారణను నిర్వహిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా గాంబియాలో ఈ మందుల వల్ల తీవ్రమైన కిడ్నీ సమస్యలు మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా 66 మంది పిల్లలు మృత్యువాత పడటం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇక డబ్ల్యూహెచ్‌ఓ విచారణ చేస్తున్న ఈ నాలుగు మందులు ఇవే.. ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ దగ్గు సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్ మరియు మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్‌లు. ఈ ఉత్పత్తుల తయారీదారు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీ హర్యానా రాష్ట్రం నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇక ఇప్పటివరకు ఈ మందుల భద్రత మరియు నాణ్యతపై సంబంధిత కంపెనీ, డబ్ల్యూహెచ్‌ఓకు ఎలాంటి పూర్తి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here