
నరేంద్రమోడీ ప్రధాని మంత్రి అయ్యాక.. ఇండియన్ రైల్వే ముఖచిత్రం మార్చేలా చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఇప్పటికే వందే భారత్ రైళ్లతో ఇండియన్ రైల్వే రూపురేఖలు మార్చిన కేంద్ర ప్రభుత్వం.. అతి త్వరలో బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తులు చేస్తోంది. దీంతో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి.
ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడర్ పేరుతో.. రైల్వే అధికారులు పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు అత్యంత పూర్తవుతున్నాయి. ఇప్పటికే బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు అవసరమైన బ్రిడ్జ్‌లను సుమారు పూర్తి చేసేశారు. బుల్లెట్ ట్రైన్ అప్ డేట్ గురించి చెబుతూ.. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ కీలక ప్రకటన చేశారు. 2026 కల్లా ఇండియాలో మొదటి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభించడానికి పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు.
వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్‌లో మాట్లాడిన అశ్విని వైష్ణవ్.. బుల్లెట్ రైలు కోసం ఇప్పటి వరకూ 270 కిలోమీటర్ల పని పూర్తయినట్లు వివరించారు. అలాగే ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, దాద్రా, నగర్ హవేలీలలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి 100 శాతం భూసేకరణ కార్యక్రమాన్ని తాము పూర్తి చేసినట్లు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఈ వార్తను కన్ఫమ్ చేసినట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. ప్రాజెక్ట్ కోసం కావాల్సిన 1389.49 హెక్టార్ల భూమిని సేకరించినట్లు అప్పుడు ఎక్స్ ఫ్లాట్ ఫామ్ లో ట్వీట్ చేశారు.
ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలని జరోలి గ్రామం దగ్గరలో 350 మీటర్ల పొడవు, 12.6 మీటర్ల వ్యాసం కలిగి ఫస్ట్ మౌంటెన్ సొరంగాన్ని కేవలం 10 నెలల్లోనే తాము పూర్తి చేశామని అధికారులు ప్రకటించారు. ఈ హై స్పీడ్ ట్రైన్ రూటును నిర్మించడానికి జపాన్‌కు చెందిన షింకన్‌సెన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నీరు. దీని కోసం జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ భారత్ కు రూ. 88,000 కోట్లను అప్పుగా అందించింది. మొత్తం రూ. 1.10 లక్షల కోట్లతో చేపట్టిన ఈ రైలు ప్రాజెక్టును ముందుగా 2022 నాటికి పూర్తి చేయాలని భావించినా.. భూసేకరణలో ఆలస్యం అవడంతో ప్రాజెక్ట్ కూడా ఆలస్యమైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE