పిల్లల్ని కనడానికి, కొత్త వ్యాపారాలకు ఆ రోజే ముహూర్తం

What Is So Special About January 22,What Is So Special,Special About January 22,January 22Nd Special ,What Is So Special About January 22,That Day Is The Time To Have Children, Start New Businesses , Ayodya Rama Mandhir,Mango News,Mango News Telugu,What Happened On January 22,Facts And Historical Events On This Day,Ayodya Rama Mandhir Latest News,Ayodya Rama Mandhir Latest Updates,Ayodya Rama Mandhir Live News
January 22nd Special ,What is so special about January 22?,That day is the time to have children, start new businesses , Ayodya Rama mandhir

ఇప్పుడు భారత్‌లో ఎక్కడ చూసినా.. జనవరి 22, 2024 గురించే టాపిక్ నడుస్తోంది.  చాలా ప్రత్యేకత సంతరించుకున్న రోజు అవడంతో.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది గర్భిణిలు ఆరోజే పిల్లలను కనడానికి నిర్ణయం తీసుకున్నారట. అదే రోజు చాలామంది తమ కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారట. దీంతో.. అసలు ఆ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి అన్న ప్రశ్నలు కొంతమందిలో తలెత్తుతున్నాయి.

గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో కొంత మంది గర్భిణీలు జనవరి 22 వ తేదీన..తమకు డెలివరీ చేయమని  డాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారట. మరి కొంతమంది అయితే ఇదే రోజు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట. అయితే ఈ తేదీకి ఎందుకంత ప్రత్యేకత.. అంటే  అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమం ఆరోజే జరుగుతుంది.

ప్రధాని నరేంద్ర మోడీ  చేతుల మీదుగా ఈ మహత్కర కార్యక్రమం జరగబోతోంది.  హిందువులంతా కలలు కన్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంతో జనవరి 22   ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకే  ఈ తేదీన తమ పిల్లలు పుట్టాలని పేరెంట్స్ కోరుకుంటున్నారట. సుమారు 100 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది.

రామ మందిర ఆలయ ప్రారంభం కన్నా శుభదినం ఉండదని చాలామంది భావిస్తున్నారు. ఆరోజే అన్ని శుభ కార్యక్రమాలను పెట్టుకోవాలని రెడీ అవుతున్నారు. అంతేకాదు ఆమరోజు పుట్టబోయే తమ పిల్లలకు రాముడి పేరునే పెట్టుకుంటామని కూడా పేరెంట్స్ చెబుతున్నారట. శుభ సమయంలో.. బిడ్డ పుడితే అది ఆ బిడ్డ వ్యక్తిత్వంపైన కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుందని అంటారు. దీంతోనే చాలామంది ఆ రోజు తమ బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నారు.

ఇప్పటికే ఉత్తప్రదేశ్‌లోని కాన్పూర్ గవర్నమెంట్ ఆసుపత్రితో పాటూ దేశ వ్యాప్తంగానూ చాలామంది  గర్భిణీలు ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్ చుట్టూ క్యూ కడుతున్నారట. జనవరి 22న  తమ పిల్లలు పుట్టాలని చాలా కుటుంబాలు పట్టుబడుతున్నాయట. ఇప్పటికి ప్రతి రోజు 14 నుంచి 15 మంది గర్భిణీల అభ్యర్ధనను స్వీకరించినట్లు కాన్పూరు ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు.  వీరందరి సెంటిమెంటును గౌరవించి  సిజేరియన్ అవసరమైన వారికి మాత్రమే ఆ రోజు డేట్ సర్దుబాటు చేసినట్లు డాక్లర్లు తెలిపారు.

మరోవైపు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి మంచి ముహూర్తం కోసం పండితులు, పురోహితులను సంప్రదిస్తారు. అయితే ఈ సారి దీనికి భిన్నంగా జనవరి 22 కంటే శుభదినం ఇక వేరే ఏం ఉంటుందని భావిస్తున్నారు చాలామంది.దీంతో  అదే రోజు తమ కొత్త వ్యాపారాలను, ఇతర శుభకార్యాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. దీంతో పురోహితులు కూడా జనవరి 22న  బిజీగా ఉండబోతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 10 =