కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్న సోనియా గాంధీ

Congress Working Committee, Congress Working Committee meeting, Congress Working Committee Meeting at Delhi, CWC Congress Working Committee Meeting, Interim Chief of Congress Party, national news, Sonia Gandhi, Sonia Gandhi Continue as Interim Chief of Congress Party

పార్టీ నాయకత్వంపై చర్చిండానికి ఈ రోజు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమైన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులు సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర కీలక నాయకులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తనను తప్పించాలని సోనియా గాంధీ కోరినప్పటికీ, సీనియర్‌ నేతలు మన్మోహన్‌ సింగ్‌, ఏకే ఆంటోనీలు ఆమే కొనసాగాలని కోరారు.

ఎ.ఐ.సి.సి సమావేశం నిర్వహించే వరకు, మరికొన్ని నెలలు పాటుగా సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలుగా కొనసాగించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడితే రాహుల్‌ గాంధీకి బాధ్యతలు అప్పగించాలని సభ్యులు కోరినట్టు సమాచారం. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలు చేయాలనీ సీడబ్ల్యూసీ సభ్యులు సోనియా గాంధీని కోరారు. ఆరు నెలల తర్వాత పార్టీ తదుపరి అధ్యక్షుడి కోసం ఎన్నిక పక్రియ నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు సమాచారం.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here