అయోధ్య రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌన వ్రతం

A Devotee 30 Years Of Silence For Ayodhya Ram Temple,A Devotee 30 Years Of Silence,Silence For Ayodhya Ram Temple,Ayodhya Ram Temple,A Devotee Like Sabari,30 Years Of Silence For Ayodhya Ram Temple,A Vow Of Silence,Mango News,Mango News Telugu,Ram Mandir Inauguration,Ram Temple Consecration,After 30 Years Of Silence,Saraswati Devi To End Her Vow,Ayodhya Ram Temple Latest News,Ayodhya Ram Temple Latest Updates,Ayodhya Ram Temple Live News
A devotee like Sabari,30 years of silence for Ayodhya Ram Temple,A vow of silence

రామాయణం గురించి ఎప్పుడు చెప్పుకున్నా.. అందులో శబరి పాత్ర గురించి చెప్పకుండా ఉండలేం. తన అచంచలమైన భక్తితో శ్రీరామ చంద్రుడికి ఎంగిలిపళ్లు తినిపించిన భక్తురాలిగా ఆమె గురించి రామాయణంలో ఎప్పుడూ ఓ ప్రత్యేక భాగమే ఉంటుంది.

ఆనాడు శబరిలోని భక్తిన, రామయ్య వస్తాడన్న నమ్మకం.. అప్పుడు శ్రీరాముడు స్వయంగా ఆమె గుడిసె వద్దకు వెళ్లేలా  చేసింది. అయితే అలాంటి ఓ ఆధునిక శబరి గురించి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేళ  అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జార్ఖండ్‌కు చెందిన సరస్వతీదేవిలో ఉన్న అపార నమ్మకమే.. రామాలయం కల సాకారమవ్వడానికి దోహదపడిందని స్థానికులు చెబుతున్నారు.

అప్పుడు శబరి కోరికను తీర్చిన శ్రీరాముడు.. తన భక్తురాలైన సరస్వతి నమ్మకాన్ని కూడా నెరవేర్చాడు.  రామయ్య తన కోరిక నెరవేర్చడంతో జనవరి 22న అయోధ్యకు చేరుకుని సరస్వతి తన ఏళ్ల మౌన వ్రతాన్ని విరమించనుంది. ఆమె గురించి తెలుసుకున్న ఆలయ ట్రస్ట్.. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఆమెకు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపింది.

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ దగ్గర కరమ్‌తాండ్‌లో ఉంటున్న 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్.. 30 ఏళ్ల క్రితం మౌనవ్రతం చేపట్టారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే వరకు కూడా తాను ఎవరితోనూ మాట్లాడబోనని సరస్వతి మొక్కుకుంది. ఇప్పుడు ఆమె కోరిక నెరవేరడంతో సాక్షాత్తూ ఆ శ్రీరామ చంద్రుడే తన కోరికను తీర్చారంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జనవరి 22న అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర ప్రారంభోత్సవం, బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగే రోజున రామ్, సీతారాం అనే మాటలతో సరస్వతి మౌన దీక్షను  విరమించనున్నారు.తన కోరినట్లుగానే ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో సరస్వతి సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =