బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆకస్మిక రాజీనామాతో తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల నిలిచిన భారత సంతతి నేత, మాజీ ఛాన్సలర్ రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మొదటి రౌండ్ ఓటింగ్‌లో అత్యధికంగా 88 ఓట్లను సాధించారు. మిగిలినవారిలో వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ (67 ఓట్లు), విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ (50 ఓట్లు), మాజీ మంత్రి కెమీ బాడెనోచ్ (40 ఓట్లు) మరియు వెనుక బెంచర్ టామ్ తుగేన్‌ధాట్ (37 ఓట్లు). ఈ ఎన్నికలలో మరో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థి, అటార్నీ జనరల్ సుయెల్లా బ్రేవర్‌మాన్ 32 ఓట్లతో చివరి స్థానంలో ఉన్నారు.
ఇక ప్రధాని రేసులో నిలవాలంటే కనీసం 30 మంది ఎంపీల (మద్దతుదారుల) ఓట్లు అవసరం కాగా, కొత్తగా నియమితులైన ఛాన్సలర్ నధిమ్ జహావి 25 ఓట్లతో, మరియు మాజీ క్యాబినెట్ మంత్రి జెరెమీ హంట్ 18 ఓట్లతో నిలిచారు. దీంతో వీరు రేసు నుంచి తొలగించబడ్డారు. రిషి సునాక్.. భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు అనే విషయం తెలిసిందే. మొదటి రౌండ్ ఓటింగ్ ఫలితం తర్వాత ప్రధాన పోటీ ముఖ్యంగా సునాక్ తో పాటు మోర్డాంట్ మరియు లిజ్ ట్రస్ మధ్య కనిపిస్తోంది. ఈ క్రమంలో తదుపరి రౌండ్ ఓటింగ్ గురువారం జరగాల్సి ఉండగా, 358 మంది పార్లమెంటులోని కన్జర్వేటివ్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొననున్నారు.
జూలై 21 నాటికి పోటీలో ఇద్దరు అభ్యర్థులే మిగిలేలా తదుపరి రౌండ్లు నిర్వహించనున్నారు. మరోవైపు పార్టీలో కూడా ఎన్నిక జరుగనుంది. దాదాపు 2,00,000 సభ్యులు ఉన్న కన్జర్వేటివ్ పార్టీలో అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి కొత్త కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నుకోబడుతారు. తద్వారా బ్రిటీష్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి అర్హత సాధిస్తారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బోరిస్ స్థానాన్ని భర్తీ చేసే వారి పేరును సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు. అయితే, కన్జర్వేటివ్ హోం వెబ్‌సైట్ తమ పార్టీలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం, సునాక్ మూడో స్థానానికే పరిమితమవుతారని అంచనా వేసింది. కాగా తన విజయంపై సునాక్ విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ