మంకీపాక్స్ వ్యాధికి కొత్త పేరు, ‘ఎంపాక్స్’ అనే పేరును సిఫార్సు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

World Health Organization Recommends New Name for Monkey Pox Disease as mpox,World Health Organization,New Name For Monkeypox,Mpox,Mango News,Mango News Telugu,Monkey Pox Disease,Monkey Pox Latest News and Updates,Mpox News and Live Updates,Monkey Pox Name Changed,Mpox New Name For Monkey Pox,Monkey Pox Cases,Monkey Pox Latest Cases,Monkey Pox India

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గత ఆగస్టులో మంకీపాక్స్ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తూ, అన్ని దేశాలు దృష్టి సారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించిన విషయం తెలిసిందే. తాజాగా మంకీపాక్స్ వ్యాధి విషయంలో డబ్ల్యూహెచ్ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంకీపాక్స్‌ కు ఇకపై “ఎంపాక్స్(mpox)” అనే కొత్త పేరు సిఫార్సు చేస్తునట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ప్రపంచ నిపుణులతో పలుమార్లు సంప్రదింపుల అనంతరం, మంకీపాక్స్‌కు పర్యాయపదంగా ‘ఎంపాక్స్’ అనే కొత్త ప్రాధాన్య పదాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తునట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మంకీపాక్స్ అనే పేరు దశలవారీగా తొలగించబడే క్రమంలో మంకీపాక్స్, ఎంపాక్స్ అనే రెండు పేర్లు కూడా ఒక సంవత్సరం పాటు ఏకకాలంలో ఉపయోగించబడతాయని పేర్కొన్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో మంకీపాక్స్ వ్యాప్తి విస్తరించినప్పుడు, ఆన్‌లైన్‌లో, ఇతర సెట్టింగ్‌లలో మరియు కొన్ని కమ్యూనిటీలలో మంకీపాక్స్ పేరు పట్ల జాత్యహంకార మరియు కళంకం కలిగించే భాష గమనించబడిందని మరియు డబ్ల్యూహెచ్ఓకి నివేదించబడిందని తెలిపారు. అనేక సమావేశాలలో పబ్లిక్, ప్రైవేట్, అనేక మంది వ్యక్తులు మరియు దేశాలు ఆందోళనలను లేవనెత్తాయని మరియు పేరును మార్చడానికి ఒక మార్గాన్ని ప్రతిపాదించమని డబ్ల్యూహెచ్ఓని కోరినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ఐసీడీ) అప్‌డేట్ ప్రక్రియకు అనుగుణంగా, కొత్త పేరు కోసం అనేక మంది నిపుణులు, సభ్య దేశాలు మరియు సాధారణ ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించి, సంప్రదింపులు జరిపి మంకీపాక్స్ వ్యాధికి కొత్త పేరుగా ఎంపాక్స్ ను సిఫార్సు చేస్తునట్టు డబ్ల్యూహెచ్ఓ ప్రకటనలో తెలిపింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 7 =