జనవరి 1, 2021 నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు ప్రకటించారు. ఫాస్టాగ్ ద్వారా ప్రయాణికులు నగదు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదని, ఈ విధానం సమయం మరియు ఇంధనాన్ని కూడా ఆదా చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ముందుగా దేశంలో టోల్గేట్ల వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటుగా, డిజిటల్, ఐటి ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో 2016 లో ఫాస్టాగ్స్ ప్రారంభించబడ్డాయి.
అయితే డిసెంబర్ 1, 2017 నుండి కొత్త నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫాస్టాగ్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఇటీవలే 1989 నాటి మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ డిసెంబర్ 1, 2017 కంటే ముందు కొనుగోలు చేసిన 4 చక్రాల పాత వాహనాలకు కూడా జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనవరి 1, 2021 నుంచి అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ విధానం అమల్లోకి రానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ