భారతదేశంలో పేదరికం (Poverty) గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి (United Nations) నివేదిక తెలిపింది. 15 ఏళ్లలో మొత్తంగా 41.5 కోట్ల మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారని చెప్పింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశం 2005-2006 నుంచి 2019-2021 మధ్య కాలంలో ఈ విషయంలో గణనీయమైన పురోగతి (Significant progress) సాధించిందని రిపోర్టులో తెలిపింది.
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP), ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ (OPHI)’లు కలిసి తాజాగా అంతర్జాతీయ బహుముఖ దారిద్య్ర సూచిక (MPI)’ను విడుదల చేశాయి. ఈ రిపోర్టులో భారత్, చైనా, కాంగో, కంబోడియా, వియత్నాం, హోండూరస్,ఇండోనేషియా, మొరాకో, సెర్బియా, వంటి 25 దేశాలు తమ పేదరికాన్ని.. 15 ఏళ్లలో సగానికి తగ్గించుకున్నట్లు తెలిపింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన పేదరికం (Poverty) నిర్మూలన దిశగా.. చాలా వేగవంతమైన పురోగతిని సాధించగలమని ఈ గణాంకాలు (Statistics) చాటుతున్నట్లు పేర్కొంది.
142.86 కోట్ల జనాభాతో ఏప్రిల్‌లో చైనాను బీట్ చేసి.. అధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మారిపోయింది. 2005-06లో భారతదేశంలో దాదాపు 64.5 కోట్ల మంది మల్టీ డైమన్షియల్ పేదరికం (Multidimensional poverty)లో ఉన్నారు. ఈ సంఖ్య 2015-16 నాటికి 37 కోట్లకు అలాగే 2019-21 నాటికి 23 కోట్లకు తగ్గినట్లు.. ఆయా సూచికల్లో నమోదైంది. పేద రాష్ట్రాలు, గ్రూపులు అత్యంత వేగవంతమైన పురోగతి నమోదు చేశాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. 110 దేశాల్లో ఉండే ప్రజల ఆరోగ్యం, ఎడ్యుకేషన్, జీవన ప్రమాణాల ఆధారం (Basis of living standards)గా ఈ ‘ఎంపీఐ’ని రూపొందించారు.
అయితే దీనికి మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (Mahatma Gandhi Rural Employment Guarantee Scheme) వల్లే పేదరికం తగ్గుముఖం పట్టడానికి ప్రధానకారణమని రూరల్ డెవలప్మెంట్ ఎక్స్‌పెర్ట్స్ (Rural development experts) చెబుతున్నారు. 2006లో ప్రారంభమైన ఈ స్కీమ్ పూర్తిస్థాయిల్లో అమల్లోకి వచ్చిన దగ్గర నుంచే పేదరికం తగ్గుముఖం పడుతూ వచ్చిందని ఉదాహరిస్తున్నారు. ఇటువంటి విశిష్టమైన పథకంపై మోడీ ప్రభుత్వం కక్ష కట్టినట్టు నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక చూసైనా.. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచిస్తున్నారు. నిజానికి ఉపాధి హామీ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు పట్టణాలకు కూడా విస్తరింపజేయాలని డిమాండ్ చేశారు.
110 దేశాల్లో ఉన్న 610 కోట్ల మందిలో.. 110 కోట్ల మంది దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని ఎంపీఐ నివేదిక పేర్కొంది. ఉప సహారా ఆఫ్రికా, దక్షిణాసియాల్లో అయితే ప్రతి ఆరుగురిలో ఏకంగా ఐదుగురు పేదరికంలో మగ్గుతున్నారని తెలిపింది. పేదవాళ్లల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది అంటే 73కోట్ల మంది మధ్య ఆదాయ దేశాల్లో (In middle-income countries) జీవిస్తున్నారు. అయితే తక్కువ ఆదాయం కలిగిన దేశాలు.. మొత్తం జనాభాలో కేవలం 10 శాతమే ఉన్నప్పటికీ.. అక్కడ 35 శాతం మంది పేదలు నివసిస్తున్నారని.. ముఖ్యంగా 18 ఏళ్లలోపు పిల్లల్లో దారిద్య్రం రేటు (Poverty rate) 27.7 శాతంగా ఉందని తెలిపింది. ప్రధానంగా పేదల్లో 84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల కన్నా.. గ్రామీణ ప్రాంతాలే దారిద్య్రంలో మగ్గుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE