దేశంలో కరోనా కేసుల పెరుగుదల, చైనాతో సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. “దేశంలో కరోనా వైరస్ కేసులు కోటి మార్కును దాటాయి. దాదాపు 1.5 లక్షల మరణాలు సంభవించాయి. ప్రణాళిక లేని లాక్‌డౌన్ ప్రధానమంత్రి చెప్పినట్లుగా 21 రోజుల్లో యుద్ధంలో విజయం సాధించలేకపోయింది, అయితే ఇది దేశంలోని లక్షలాది మంది జీవితాలను నాశనం చేసింది” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అలాగే చైనాతో వివాదం అంశంపై స్పందిస్తూ “నేను చైనా చర్యల గురించి ప్రజలను నిరంతరం హెచ్చరిస్తున్నాను. కేంద్రం అశ్రద్దతో సరిహద్దుల్లో చైనా తెలివిగా సన్నాహాలు చేస్తూనే ఉంది. ఈ విషయంలో సకాలంలో చర్యలు తీసుకోవడం భారతదేశానికి ఎంతో కీలకం” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
1 Crore covid infections with almost 1.5 lakh deaths!
The unplanned lockdown did not manage to ‘win the battle in 21 days’ as the PM claimed, but it surely destroyed millions of lives in the country.
— Rahul Gandhi (@RahulGandhi) December 19, 2020
I have been continuously warning people about Chinese actions.
China continues to make diligent preparations while GOI sleeps.
Timely action is critical for India. pic.twitter.com/aqqV0vIHFx
— Rahul Gandhi (@RahulGandhi) December 19, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ