రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటనతో తెలుగు సినీపరిశ్రమకు ఊరట, హర్షం వ్యక్తం చేసిన పలు సినీసంస్థలు

AP Cabinet Approves Cinema Restart Package,Andhra Govt To Give Restart Packages To Cinemas,CM Bharosa For Film Industries In Andhra Pradesh,Andhra Govt To Give Financial Aid To Theatres That Incurred Losses Due To Covid-19,Andhra Govt To Give Restart Packages Films,Film Industry Hails AP Govts Restart Package,Andhra Pradesh Government,Andhra Pradesh,Andhra Pradesh News,Restart Packages,Andhra Pradesh Cabinet Meeting,Restart Package List,Andhra Pradesh Restart Package,Highlights Of AP Cabinet Meeting,Mango News,Mango News Telugu,AP Cabinet,Andhra Pradesh Cabinet,Andhra Pradesh Cabinet Approves Cinema Restart Package,Cinema Restart Package

తెలుగు సినీపరిశ్రమకు ఉరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సినీ పరిశ్రమకు రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పలు టాలీవుడ్ నిర్మాణ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపాయి.

సినీ పరిశ్రమకు రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు:

  • 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు.
  • ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం. ఈ నిర్ణయంతో నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుంది.
  • మిగిలిన ఆరు నెలల థియేటర్ల ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లింపును వాయిదా పద్దతిలో చెల్లించేలా నిర్ణయం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి.
  • రీస్టార్ట్‌ ప్యాకేజీకింద వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు అందజేత.
  • ఏ, బి సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున రుణం.
  • సి సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ.5లక్షల చొప్పున రుణం.
  • వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియంకు ప్రభుత్వం నిర్ణయం. తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరించేలా నిర్ణయం. దీంతో ప్రభుత్వంపై రూ.4.18 కోట్ల భారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + thirteen =