ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Daughter entitled to equal property rights, Daughters Have Right to HUF Property, Hindu Undivided Family Property, HUF daughters have equal property right, Rights of Daughters to have a Share in Hindu Undivided Family Property, Supreme Court Verdict, Supreme Court Verdict Over Rights of Daughters

ఆడపిల్లల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని కొడుకులతోపాటు ఆడపిల్లలకు కూడా సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హిందూ అవిభక్త కుటుంబానికి సంబంధించి తండ్రి లేదా తల్లి 2005 కంటే ముందే మరణించినా కూడా కుమార్తెలకు వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు తీర్పుతో స్పష్టం చేసింది. ఓ కేసులో విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.

గతంలో తండ్రి, కుమార్తె ఇద్దరూ జీవించి ఉంటేనే కుమార్తెకు సహా వారసత్వం హక్కు కోరే అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా సవరణ సమయం సెప్టెంబర్ 9, 2005 నాటికి తండ్రి లేదా కుమార్తె జీవించి ఉన్నారా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా కుమార్తెకు వారసత్వ హక్కు ఉంటుందని ఈ తీర్పులో పేర్కొన్నారు. కుమార్తె సంతానం చట్టపరంగా ఆమెకు రావలసిన వాటాను కోరవచ్చని తెలిపారు. తాజా కోర్టు తీర్పుతో కొడుకుతో సమానంగా, కుమార్తెకు కూడా ఆస్తిలో హక్కును వచ్చే విషయంపై సందేహాలు తొలిగిపోనున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 17 =