ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది. ఏప్రిల్ 9 (శనివారం) తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది. యూపీ సీఎంఓ ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. గుర్తు తెలియని హ్యాకర్లు యూపీ సీఎంఓ ట్విట్టర్ హ్యాండిల్‌ని ఉపయోగించి “ట్విట్టర్లో మీ BAYC/MAYCని యానిమేట్ చేయడం ఎలా” అనే ట్యుటోరియల్ ఆధారంగా పోస్ట్‌ను ప్రచురించారు. గుర్తు తెలియని హ్యాకర్లు యూపీ సీఎంఓ ఖాతాలో కొన్ని యాదృచ్ఛిక ట్వీట్ల థ్రెడ్‌ను కూడా పోస్ట్ చేశారు. అలాగే యూపీ సీఎంఓ ట్విట్టర్ ఖాతాలో ఒక కార్టూనిస్ట్ చిత్రాన్ని ప్రొఫైల్ చిత్రంగా ఉపయోగించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సీఎంఓ యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి వందలాది మంది వినియోగదారులను ట్యాగ్ చేస్తూ హ్యాకర్లు అనేక ట్వీట్లను పోస్ట్ చేశారు. అయితే కొద్దిసేపట్లోనే దీనిని గుర్తించిన కార్యాలయ సిబ్బంది వెంటనే ట్విట్టర్ అధికారిక కార్యాలయంతో సంప్రదించి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. సీఎంఓకు సంబంధించిన విషయం కావడంతో ప్రభుత్వ అధికారులు మరియు ట్విట్టర్ ప్రతినిధులు ఆగమేఘాలపై స్పందించి వెంటనే ట్విట్టర్ ఖాతాను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. దాదాపు 4 గంటల తర్వాత ఖాతా పాక్షికంగా పునరుద్ధరించబడింది. కాగా ట్విట్టర్ ఖాతాను స్వాధీనం చేసుకున్న తర్వాత హ్యాకర్లు పోస్ట్ చేసిన ట్వీట్లు తీసివేయబడ్డాయి. ఈ కేసును సైబర్ నిపుణులు విచారించిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ ప్రభుత్వం ట్వీట్ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ