భారత 14వ ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో దాదాపు 93 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 50 మందికి పైగా ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 780 మంది ఎంపీలు ఉండగా, పోలింగ్ ముగిసే సమయానికి సాయంత్రం 5 గంటల వరకు 725 మంది ఎంపీలు ఓటు వేసినట్లు అధికారులు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించినప్పటికీ, ఆ పార్టీకి చెందిన ఎంపీలు సిసిర్ కుమార్ అధికారి మరియు దిబ్యేందు అధికారి ఇద్దరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుండటంతో.. భారత తదుపరి ఉపరాష్ట్రపతిని నిర్ణయించేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగా, ప్రతిపక్షాలు మార్గరెట్ అల్వా పేరును ప్రతిపాదించాయి. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు రాత్రికి తుదిఫలితం వెలువడనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY






































