ఏపీలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’కు ఘనంగా ఏర్పాట్లు.. కోటి జాతీయ జెండాలు ఎగరేయడానికి ప్రభుత్వం సన్నాహాలు

AP Govt Decides To Hoist One Crore National Flags For Grand Celebrations of Har Ghar Tiranga in The State, YSRCP Govt Decides To Hoist One Crore National Flags For Grand Celebrations of Har Ghar Tiranga in The State, One Crore National Flags For Grand Celebrations of Har Ghar Tiranga in The State, Andhra Pradesh Govt to hoist 1.62 crore national flags, Grand Celebrations of Har Ghar Tiranga in The State, Har Ghar Tiranga Grand Celebrations In AP, 1.62 crore national flags, Har Ghar Tiranga programme, Har Ghar Tiranga Grand Celebrations, Har Ghar Tiranga, Har Ghar Tiranga Celebrations News, Har Ghar Tiranga Celebrations Latest News, Har Ghar Tiranga Celebrations Latest Updates, Har Ghar Tiranga Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కోటి జెండాలను వివిధ శాఖల ద్వారా కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ జెండాలను గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వాప్తంగా కోటి జాతీయ జెండాలు ఎగరేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ క్రమంలో 12వ తేదీన జరుగనున్న హర్‌ ఘర్‌ తిరంగాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొననున్నారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 యేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేకమంది సమరయోధులను, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. భవిష్యత్ తరాలకు వారి గొప్పతనాన్ని తెలియజేయాలని భావిస్తూ 75 వారాల పాటు దీనిని నిర్వహించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జెండా ఎగుర వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో దీనిని ఘనంగా నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =