“Mee Sunaina” యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ నటి, టీవీ హోస్ట్, యూట్యూబర్, ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ ఎపిసోడ్‌లతో పాటు మరెన్నో సిరీస్ లను, డబుల్ ఎంటర్టైన్మెంట్ తో నిజజీవితంలో జరిగే ఆహ్లాదకరమైన కంటెంట్ తో కూడిన వీడియోలను ఈ ఛానల్ లో వీక్షించొచ్చు. అందులో భాగంగా ఈ వీడియోలో యాక్ట్రెస్/నటి యొక్క ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూపించిన సునయన, తన అభినయంతో ఆకట్టుకున్నారు. సడెన్ గా షూటింగ్స్ కి హాజరుకావాల్సి రావడం, షూటింగ్ లో ఎదుర్కునే సమస్యలు, మేకప్ సహా యూనిట్ లో జరిగే కొన్ని కొన్ని సంఘటనలపై నటీనటులు ఎలా ఫ్రస్ట్రేట్ అవుతారో తెలుసుకోవాలంటే ఎంతో సరదాగా సాగే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
ఫ్రస్ట్రేషన్ ఆఫ్ యాక్ట్రెస్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇