ప్రముఖ సీనియర్ నటి జమున మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, పలువురు సినీ ప్రముఖుల సంతాపం

Megastar Chiranjeevi and Many other Film Personalities Mourn the Demise of Tollywood Legendary Actress Jamuna,Tollywood Senior Actress,Jamuna Passed Away,Jamuna Passed Away Today,Tollywood Senior Actress Jamuna,Mango News,Mango News Telugu,Actress Jamuna Full Name,Is Actress Jamuna Alive,Jamuna Daughter,Jamuna Surname,Jamuna Husband,Jamuna Age,Actress Jamuna Family,Actress Jamuna Net Worth,Actress Jamuna Disease,Actress Jamuna House In Hyderabad,Actress Jamuna Family Photos,Actress Jamuna Parkinson,Actress Jamuna News,Actress Jamuna Interview,Actress Jamuna Rare Photos,Actress Jamuna Latest News

ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ జమున కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడంతో పాటు హిందీ సినిమాలలోనూ కూడా ఆమె నటించి ప్రేక్షకులు, ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జమున మృతితో తెలుగు సినీపరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. సీనియర్ నటి జమున మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. సినీరంగానికి నటి జమున అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను – మెగాస్టార్ చిరంజీవి

అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజున జమున గారు బౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను – నందమూరి బాలకృష్ణ

ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన జమున గారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. జమున గారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను – జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

దాదాపుగా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహారాణిలా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి – జూనియర్ ఎన్టీఆర్

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here