యధా పేరెంట్స్ తథా పిల్లలు..

If you love nature, your kids will too,A study by researchers, National University of Singapore, nature, parents to children.

ప్రకృతిని ఇష్టపడని మనుష్యులు ఉండరు . కాకపోతే కొంతమందిలో ప్రకృతిపై ప్రేమ మరికాస్త ఎక్కువగా ఉంటుంది. మరికొంతమంది అయితే నేచుర్ అంటే ఇష్టమున్నా.. పనుల ఒత్తిడి, ఇతర వ్యాపకాలతో ప్రకృతితో గడపాలన్న కోరికను కట్టేసుకుంటారు. కొంతమంది అయితే మాత్రం ఆరు నూరైనా నూరు ఆరైనా నేచుర్ మధ్య గడపాలనుకుంటారు. దానికోసం ప్రత్యేకించి ఓ సమయాన్ని కేటాయించి మరీ.. తమ సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటారు.
సహజంగానే ఎవరో తప్ప చాలామంది ప్రకృతి ప్రేమికులు కనిపిస్తుంటారు. పచ్చని చెట్లు, పార్కులు, అందమైన పరిసరాలు కనిపిస్తే తమలోని ప్రకృతి ప్రేమికులను మేల్కొలిపి అక్కడ కాసేపు గడిపి కానీ కాలు కదపరు. లేదంటే డైలీ హ్యాబిట్ లిస్టులో వీటిని చేర్చేసుకుంటారు. ఏ మాత్రం వీలున్నా తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచాలని భావిస్తుంటారు. అయితే ఇలాంటి ప్రకృతి ఆరాధన తల్లిదండ్రుల నుంచి పిల్లలకు జన్యుపరంగా కూడా సంక్రమిస్తుందని.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం తేల్చింది.

ఎవరైతే ఎక్కువగా ఆరుబయట సన్నిహితంగా ఉంటారో, ఎవరు పచ్చని ప్రదేశాలను తరచుగా సందర్శిస్తుంటారో తెలుసుకోవడానికి జన్యుశాస్త్రం సహాయపడుతుందని అధ్యయన కర్తలు పేర్కొంటున్నారు. వీరి స్టడీలో భాగంగా రీసెర్చర్స్ ట్విన్స్‌ యుకె రిజిస్ట్రీ నుంచి 2వేల జంటలను, వారి పిల్లలను మదర్ నేచర్ పట్ల వారి ఫీలింగ్స్‌ గురించి సర్వే చేశారు.

ప్రకృతిలో సమయం గడపాలనే వాళ్లలోని కోరికను, అలాగే వాళ్లు పబ్లిక్ పార్కులు, ప్రైవేట్ గార్డెన్‌ల వంటి గ్రీనరీ ప్రదేశాలను తరచుగా సందర్శించిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి ప్రేమికులైన పేరెంట్స్ నుంచి 100 శాతం జన్యువులను పంచుకున్న మోనోజైగోటిక్ అని కూడా పిలువబడే పిల్లలతో పాటు.. 50 శాతం మాత్రమే జన్యువులను పంచుకునే పిల్లలతో పోల్చారు. అంతేకాదు వారి తల్లిదండ్రుల లక్షణాలు పుణికిపుచ్చుకున్న పిల్లలు.. వందశాతం ప్రకృతిపై తమ అభిప్రాయాలలో ఎక్కువ ప్రేమను, ఆరాధనను చూపించినట్లు తేలింది. అంతేకాదు వీళ్లు మిగిలిన పిల్లల కంటే కూడా యాక్టివ్‌గా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE