ఆ ఇద్దరు సీఎంలపై ప్రజల రియాక్షన్?

Survey Of Telangana Andhra Pradesh Madhya Pradesh Rajasthan Chhattisgarh Mizoram,Latest Election Survey In India,2024 Election Polls,Indian General Election Polls,Mango News,Mango News Telugu,Telangana Election Survey 2024, Andhra Pradesh Election Survey 2024, Madhya Pradesh Election Survey 2024, Rajasthan Election Survey 2024, Chhattisgarh Election Survey 2024, Mizoram Election Survey 2024,

ఈ సంవత్సరం చివర్లో 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరుగనున్నాయి. నిజం చెప్పాలంటే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అన్ని పార్టీలకు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారిపోయాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలా అయినా గెలిచి తీరాలనే ఫీలింగ్‌లో ఉన్నాయి.తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

అయితే ఇయాన్ కోఓటర్ అనే సర్వే సంస్థ .. ఓ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాల్లో ప్రజలు ఆ గవర్నమెంట్ పరిపాలనపై సంతోషంగా ఉన్నారా లేక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా ? తమతమ రాష్ట్రాల ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై వారి అభిప్రాయం ఎలా ఉందనే సర్వే నిర్వహించింది. దీనిపై తాజాగా ఇయాన్ కో ఓటర్ యాంగర్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలపై ఆయా రాష్ట్రాల ప్రజల్లో కోపం ఎక్కువగా ఉందని ఇయాన్ సర్వేలో తేలింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలపై ప్రజలు మండిపోతున్నారని సర్వే వెల్లడించింది.అయితే తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం తక్కువగా తేలింది.

అలాగే ముఖ్యమంత్రుల్లో ప్రజల ఆగ్రహం తక్కువగా ఉన్న ముఖ్యమంత్రులలో ఛత్తీస్‌గ‌ఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మొదటిస్థానంలో ఉండగా..మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత స్థానంలో ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ .. అత్యంత ప్రజాధరణ ఉన్న సీఎంగా నిలిచారు. ఛత్తీస్ గఢ్ పాలనపై సంతృప్తిగా ఉన్న వంద మందిలో.. కేవలం 25.4 శాతం మంది మాత్రమే భూపేష్ బఘేల్‌పై ఆగ్రహంగా ఉన్నారు. తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 27 మంది మాత్రమే కోపంగా ఉన్నారు.

అయితే రెండు సార్లు గెలిచిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కొంత వ్యతిరేకత పెరిగినట్లు కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ పై ఏకంగా 50.2 శాతం మంది తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, తర్వాతి స్థానంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ 49.2 శాతం మంది ఆగ్రహం పొందిన సీఎంగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై 43.1 శాతం, మిజోరా ముఖ్యమంత్రి జోరంతంగాపై 37.1 శాతం మంది కోపంతో ఉన్నారని సర్వే వెల్లడించింది.

ఇక ఎమ్మెల్యేలపైన ఉన్న ప్రజాగ్రహాన్ని కూడా ఇయాన్ కోఓటర్ అనే సర్వే సంస్థ బయటపెట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో 44 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై, ఏపీలో 44.9 శాతం, తెలంగాణలో 27.6 శాతం, రాజస్థాన్ లో 28.3 శాతం, మిజోరంలో 41.2 శాతం, మధ్య ప్రదేశ్‌లో 40.4 శాతం ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారని సర్వే వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here