కేసీఆర్ అయితేనే కరెక్ట్

Kcr Is Correct Asaduddin Owaisi Says It Would Be Good If Kcr Leads The Third Front,Telangana CM KCR,Asaduddin Owaisi,Asaduddin Owaisi Says Kcr Leads The Third Front,CM KCR Third Front, CM KCR Latest News,CM KCR Latest Updates,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

‘ఇండియా’ కూటమిలో చేరాల్సిందిగా ప్ర‌తిప‌క్షాలు తనకు ఆహ్వానం పంపకపోవడంపై దాని గురించి తాను పట్టించుకోవడం లేదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అన్నారు. ఇదే స‌మ‌యంలో థ‌ర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడిన ఒవైసీ.. థ‌ర్డ్ ఫ్రంట్ కు అవ‌కాశ‌ముంద‌నీ, దీనికి బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ నాయకత్వం వహిస్తారని తాను ఆశిస్తున్నాన‌ని చెప్పారు.

థర్డ్ ఫ్రంట్ ఏర్పడే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయనీ, తెలంగాణ సీఎం చొరవ తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. థర్డ్ ఫ్రంట్‌కు కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌హించాల‌ని తాను కోరుతున్న‌ట్టు చెప్పుకొచ్చారు. “థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం ఉందని తాను కచ్చితంగా భావిస్తున్నానని.. మాయావతి, కేసీఆర్ లాంటి నేతలు ఇప్పుడున్న ఇండియాలో లేరని చెప్పుకొచ్చారు. అంతెందుకు సహేతుకమైన ఉనికి ఉన్న పార్టీలు కూడా ఎన్డీయే, ఐఎన్డీ కూటమిలో లేవన్నారు. కాబట్టి,తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని తాను ఆశిస్తున్నానని ఒవైసీ అన్నారు. అంతేకాదు కేసీఆర్ కనుక నాయకత్వం వహిస్తే రాజకీయ శూన్యత భర్తీ అవుతుందన్నారు. ఇండియా కూటమి రాజకీయ శూన్యతను పూరించలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో చేరాల్సిందిగా తనను ఆహ్వానించకపోవడంపై తాను పట్టించుకోవడం లేద‌ని ఒవైసీ స్ప‌ష్టం చేశారు.

హైదరాబాద్‌లో రెండు రోజులుగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం గురించి కూడా ఓవైసీ మాట్లాడారు. సీడబ్ల్యూసీ సమావేశంలో “దళితులు,ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు పెంచాలని సిఫారసు చేసింది మంచిదే మరి. ముస్లింల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. అలాగే మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల గురించి సీడబ్ల్యూసీలో ఎందుకు మాట్లాడలేదన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటులో తాను చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు. మైనార్టీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కపటత్వం ప్రదర్శిస్తోందని ఒవైసీ ఆరోపించారు. అంతేకాదు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ గఢ్‌లలో మైనార్టీలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.

అలాగే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పాలనలో శాంతిభద్రతలు బాగా క్షీణించాయన్న ఒవైసీ.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అన్నారు.కానీ తెలంగాణలో ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదని చెప్పారు. ముస్లిం అమ్మాయిలు హిజాబ్‌లు ధరిస్తే తప్ప.. కాలేజీలకు వెళ్ల‌లేని ప‌రిస్థితులు ఇక్కడ లేవని ఒవైసీ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇక్కడ ముస్లింలను చంపడం లేదని విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEKCR is correct, Asaduddin Owaisi, KCR leads the Third Front,KCR

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here