
భారతదేశంలో కులమతాలకు అతీతంగా చాలామంది ఉపవాసాలు ఉండటం చూస్తుంటాం. ఒక్కో మతం నమ్మకంతో ఒక్కో రకంగా ఉపవాసాలు చేయడం కనిపిస్తూనే ఉంటుంది. ఉపవాసాల వల్ల ఇటు దేవుడి అనుగ్రహం పొందొచ్చు..అటు ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి.. ఎవరైనా ఎప్పుడైనా పాస్టింగ్ ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
అందుకే ఇప్పుడు ఉపవాసాన్ని ఒక వెల్నెస్ ట్రెండ్‌గా పిలుచుకుంటున్నారు. షార్ట్-టర్మ్ ఫాస్టింగ్ వల్ల మానవ శరీర కణాలు మెరుగ్గా రిపేర్ అవుతాయట. నిద్ర నాణ్యత మెరుగవుతుందని.. ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, ఉపవాసం వల్ల త్వరగా వృద్ధాప్యాన్ని రాకుండా ఆపొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
“ది ఎఫెక్ట్ ఆఫ్ ఫాస్టింగ్ ఆన్ హ్యూమన్ మెటబాలిజం అండ్ సైకలాజికల్ హెల్త్” అనే ఆర్టికల్‌లో ప్రచురించినట్లుగా .. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ , వారానికి మూడు రోజులు ఉపవాసం, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందట. ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హార్మోన్. ఉపవాసం చేయడం వల్ల మధుమేహానికి దారితీసే రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులను నివారించే అవకాశం ఉంటుందట.
షార్ట్-టర్మ్ ఫాస్టింగ్ అనేది రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్‌లో రోజుకి ఆరు గంటల సమయంలో మాత్రమే తినాలని మిగిలిన సమయంలో, ఉపవాసం ఉండాలి. ఎముక మజ్జ నుంచి రక్త ప్రసరణకు రోగనిరోధక కణాలను లేదా ల్యూకోసైట్లను తరలించడంలో షార్ట్ టర్మ్ ఫాస్టింగ్ పనికొస్తుందట. అంతేకాదు ఈ పాస్టింగ్ వల్ల ప్లానేరియన్లు అనే శాశ్వతంగా జీవించగల క్రిముల లాంటి జీవులు వృద్ధి చెందుతాయి. దీనివల్ల వృద్ధాప్యం త్వరగా రాదు.
ప్లానేరియన్లు ఉపవాసం చేస్తూ.. మళ్లీ ఆహారం తీసుకున్నప్పుడు కొత్త భాగాలు, కణాలను వృద్ధి చేసుకోగలవు. కాబట్టి ఫాస్టింగ్, ఈటింగ్ నేచురల్ సైకిల్స్ అనేవి వాటి స్టెమ్ సెల్స్‌ను ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతాయి. దీనివల్ల ప్లానేరియన్లు చనిపోకుండా ఉంటాయి.అందుకే రోజుకు ఒకసారి భోజనం చేయడం మానేయడం మంచిదని..దీని వల్ల వృద్ధాప్యం త్వరగా దరిచేరకుండా జాగ్రత్త పడొచ్చని అధ్యయన కర్తలు చెబుతున్నారు .
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE