బీఆర్ఎస్‌కు షాక్.. రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

Shock for BRS BRS MLAs Who Met Revanth Reddy, Shock for BRS, BRS MLAs Met Revanth Reddy, Revanth Reddy Met BRS MLAs, CM Revanth Reddy, Congress, BRS MLAs, Telangana Politics, Latest BRS MLAs News, Gudem Mahipal Reddy, KCR, Telangana Political News, Elections, Political News, Mango News, Mango News Telugu
CM Revanth reddy, Congress, BRS MLAs, Telangana Politics

తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ గద్దె దిగిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొంది అధికారం చేజిక్కించుకుంది. అయితే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అటు అసెంబ్లీలో తమ బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు గాలం వేస్తోందని గుసగుసలు వినిపించాయి. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.

ఇటీవల రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు వచ్చారు. ఈక్రమంలో మంగళవారం పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లి కలిశారు. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలు దక్కించుకొని తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతోంది. లోక్ సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమయంలో నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంతో.. వారంతా కాంగ్రెస్ గూటికి చేరుతారని ఊహాగాణాలు వెలువడతున్నాయి. ఇది బీఆర్ఎస్‌కు పెద్ద షాకేనని విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఈ ఊహాగాణాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరడం లేదని.. బీఆర్ఎస్‌లోనే ఉంటామని చెబుతున్నారు. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశామని అంటున్నారు. తాము ఎట్టిపరిస్థితిలోనూ కాంగ్రెస్‌లో చేరేది లేదని తేల్చి చెబుతున్నారు. అయితే ఎంత చెప్పినప్పటికీ వారు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగాణాలు మాత్రం బలంగా వెలువడుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =