వైసీపీకి రాజీనామా చేసే యోచనలో మరో ఎమ్మెల్యే

Another MLA Is Planning To Resign From YCP, Another MLA Is Planning To Resign, YCP MLA Is Planning To Resign, YCP MLA Resign, YCP, Mylavaram, Jaggampeta, MLA Krishnaprasad, Latest YCP Jaggampeta MLA News, Jaggampeta MLA Resign News, Latest YCP MLAs News, CM Jagan, AP Live Updates, YCP, Andra Pradesh, Political News, Mango News, Mango News Telugu
YCP, Mylavaram, Jaggampeta, MLA Krishnaprasad

ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద సంఖ్యలో సిట్టింగ్‌లను మార్చడం కాక రేపుతోంది. ఇప్పటికే 50 మందికి పైగా సిట్టింగ్‌లను ఛేంజ్ చేసిన జగన్.. మరికొంత మందిని కూడా ఛేంజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన మైలవరం నియోజకవర్గం పేరు తెరపైకి వచ్చింది. ఆ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చేందుకు జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైడ్ చేసి.. ఆయన స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జగన్ చూస్తున్నారట.

ప్రస్తుతం మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. 2018లో కృష్ణప్రసాద్ వైసీపీలో చేరారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావును ఓడించి విజయకేతనం ఎగురవేశారు. అయితే కొంతకాలంగా వసంతకృష్ణప్రసాద్ పనితీరు బాగాలోదని ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా కృష్ణ ప్రసాద్ సరిగా నిర్వహించలేదట. అప్పట్లో ఆయనను పిలిపించుకొని హైకమాండ్ హెచ్చరించిందని కూడా ప్రచారం జరిగింది.

ఈక్రమంలో కృష్ణప్రసాద్‌ను మైలవరం కాకుండా వేరే నియోజకవర్గానికి పంపించాలని జగన్ భావిస్తున్నారట. మైలవరం నుంచి జ్యేష్ట రమేశ్ బాబును బరిలోకి దించాలని అనుకుంటున్నారట. ఇప్పటికే రమేశ్ బాబు బలాబలగాలను.. నియోజకవర్గంలో ఆయనకు ఉన్న పేరును ఇతర అంశాలను పరిశీలించిన జగన్.. మైలవరం నుంచి ఆయన పోటీ చేయడమే కరెక్ట్ అని అనుకుంటున్నారట. ఇప్పటికే రమేశ్ బాబుతో జగన్ చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే జాబితాలో రామేశ్ బాబు పేరు ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

అదే సమయంలో కృష్ణప్రసాద్‌ను ఈసారి మైలవరం నుంచి కాకుండా జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించారట. కానీ కృష్ణప్రసాద్‌కు జగ్గంపేట నుంచి పోటీ చేయడం ఏమాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఈసారి కూడా మైలవరం నుంచే పోటీ చేస్తానని.. తనకు ఆ టికెటే ఇవ్వాలని హైకమాండ్ వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారట. వైసీపీ హైకమాండ్ మాత్రం మైలవరం టికెట్ ఇచ్చేది లేదని.. జగ్గంపేట నుంచే పోటీ చేయాలని తేల్చేసిందట. దీంతో కృష్ణారావు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 3 =