ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం ఎక్కువ అవుతుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది.అధికంగా ఉప్పు వాడటం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు వంటివి సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.ఒక మనిషి సగటున రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పును కనుక ఆహారంగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ప్రతి ఒక్కరూ ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలను కోల్పోకుండా కాపాడవచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పెద్దలను గమనిస్తే వారిలో సగటు ఉప్పు వాడకం 10.78 గ్రాములుగా ఉందని.. కానీ ఇది తాము సూచించిన 5 గ్రాముల పరిమితి కంటే చాలా అంటే చాలా ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ ఉప్పు ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల ఊబకాయం సమస్య ఏర్పడటంతో పాటు.. అన్నాశయ క్యాన్సర్, ఆస్టియోపోరోసిస్, మెనియర్స్, మూత్ర పిండాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
ఎక్కువ ఉప్పు వాడకం వల్ల ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా 18.9 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఉప్పు వాడకాన్ని తగ్గించడానికి ఖర్చు పెట్టే ప్రతి డాలర్ ఖర్చుకు బదులుగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డబ్ల్యూహెచ్‌వో వివరించింది.తాజా ఆహారాలతో పాటు తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలుల తినడం వల్ల ఉప్పు వాడకాన్ని తగ్గించొచ్చని సూచించింది. ఎందుకంటే నిల్వ ఉండటానికి ఆయా ఆహారపదార్ధాలలో ఉప్పు కంటెంట్ ఎక్కువగా వాడతరని చెప్పింది. ఉప్పు వాడకానికి బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడమని డబ్ల్యూహెచ్‌వో సలహా ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY