చెన్నై జట్టుకు మరో ఎదురుదెబ్బ, ఐపీఎల్-2020 నుంచి తప్పుకోనున్న హర్భజన్‌ సింగ్‌?

CSK star Harbhajan Singh, Harbhajan Singh 2nd CSK player, Harbhajan Singh Decides to Skip IPL-2020, Harbhajan Singh follows Suresh Raina, Harbhajan Singh IPL 2020, Harbhajan Singh likely to miss IPL 13, Harbhajan Singh pulls out of IPL 2020, Harbhajan Singh to skip IPL 2020, IPL 2020, Spinner Harbhajan Singh

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సమయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే‌ ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా వివిధ కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకోగా, తాజాగా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సైతం ఈ ‌ సీజన్‌ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే హర్భజన్‌ సింగ్ ఈ సంవత్సరం జట్టుకు దూరమవుతున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు చెన్నై జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, సిబ్బంది సహా మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరందరిని క్వారంటైన్ లోనే ఉంచారు. 14 రోజుల ఐసోలేషన్‌ అనంతరం పరీక్షలు నిర్వహించి ప్రాక్టీస్ సెషన్ కు అనుమతించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here