‘ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫాం’ విధానంపై అన్ని రాష్ట్రాలు ఆలోచన చేయాలి – ప్రధాని మోదీ

PM Modi Pitches Idea of One Nation-One Uniform For Police at MHA's Chintan Shivir, PM Modi Idea of One Nation-One Uniform, One Nation-One Uniform For Police, MHA's Chintan Shivir, Mango News, Mango News Telugu,Chintan Shivir, Home Ministers of States, PM Modi will Address Chintan Shivir, Home Ministers of States on October 28th, Mango News, Mango News Telugu, PM Modi will Address Chintan Shivir, Chintan Shivir On Cybercrime, Women's Safety, Drug Trafficking, Chintan Shivir 2022, Congress New President Mallikarjun Kharge, PM Modi Latest News And Updates

భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు ‘ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం’ విధానంపై మరియు సాధ్యాసాధ్యాలపై ఆలోచన చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్గత భద్రతపై అన్ని రాష్ట్రాల హోం మంత్రులతో నిర్వహించిన మేధోమథనం (చింతన్ శిబిర్) కార్యక్రమంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పోలీసులకు ‘ఒక దేశం, ఒకే యూనిఫాం’ అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమేనని, తాను దానిని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా పోలీసుల గుర్తింపు ఒకేలా ఉండాలని తాను నమ్ముతున్నానని ప్రధాని అన్నారు.

దీని గురించి ప్రధాని మోదీ మరింత వివరంగా మాట్లాడుతూ.. అందరూ ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించాలని, ఇది ఇప్పటికిప్పుడు జరుగకపోవచ్చని, మరో 5, 50 లేదా 100 సంవత్సరాల తర్వాతైనా జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాల తరపున మీరందరూ దీనిగురించి ఒక్కసారి ఆలోచించండని కోరారు. అలాగే నేరాలు మరియు నేరస్థులను ఎదుర్కోవడానికి రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారం అవసరమని నొక్కి చెప్పారు. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఒక రాష్ట్రానికి పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్రంగా మరియు అంతర్జాతీయంగా మారుతున్నాయని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతికతతో, నేరస్థులకు ఇప్పుడు మన సరిహద్దులు దాటి నేరాలు చేసే శక్తి ఉందని, అందుకే అన్ని రాష్ట్రాల ఏజెన్సీల మధ్య మరియు కేంద్రం మధ్య సమన్వయం చాలా కీలకం అని ప్రధాన మంత్రి అన్నారు.

ఇంకా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నేరాలను ట్రాక్ చేయడంలో సాంకేతికత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మనం ఇప్పుడు 5జీ యుగంలోకి ప్రవేశించామని, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు మన సొంతమని పేర్కొన్నారు. దీనిని ఉపయోగించుకుని ముఖ గుర్తింపు సాంకేతికత, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ, డ్రోన్ మరియు సీసీటీవీ టెక్నాలజీలో అనేక రెట్లు అభివృద్ధి ఉంటుందని, తద్వారా నేరస్తుల కంటే మనం పది అడుగులు ముందుండాలని ఆయన సూచించారు. దేశంలో శాంతిభద్రతలు మరియు భద్రతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని ఏజెన్సీల సమన్వయంతో ముందుకు సాగుదామని ప్రధాని మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =