
ఎప్పుడెప్పుడా అని యావత్ ప్రపంచం ఎదురు చూసిన ఒలింపిక్ గేమ్స్ 2024.. పారిస్ వేదికగా గురువారం ప్రారంభం అయిపోయాయి. జులై 25న ఒలింపిక్ గేమ్స్ మొదలవగా.. జులై 26న గేమ్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను ఇప్పటి వరకూ స్టేడియంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి మాత్రం సంప్రదాయానికి భిన్నంగా పారిస్ మీదుగా ప్రవహించే సీన్ నది తీరంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.
ఇక ఈ ఒలింపిక్స్ గేమ్స్ లో ..భారతదేశం నుంచి 117మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారు. 16 విభాగాల్లో సత్తా చాటడానికి భారతీయ క్రీడాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. అత్యధిక పతకాల సాధనే లక్ష్యంగా వీరంతా ముందుకు సాగుతున్నారు. భారత దేశం నుంచి అథ్లెటిక్స్ విభాగంలో అత్యధికంగా 29 మంది పోటీ పడబోతున్నారు. ఆ తర్వాత అత్యధికంగా 21 మంది భారతీయ షూటర్లు ఉన్నారు.
ఈ ఏడాది 72 మంది ఇండియన్ ఒలింపియన్లు తొలిసారిగా ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ పడబోతున్నారు. దీనినిబట్టి మొత్తం సంఖ్యలో 62 శాతం మంది క్రీడాకారులు కొత్తవారే. అలాగే ఈ సారి ఒలింపిక్స్ లో పాల్గొననున్న 117మంది క్రీడాకారుల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఎనిమిది మంది ఉన్నారు. మన దేశం తరపున ఒలింపిక్స్ లో పాల్గొంటున్న అత్యంత చిన్న వయస్కురాలిగా 14 ఏళ్ల స్విమ్మర్ ధీనిధి దేశింగు పోటీకి దిగుతున్నారు.
44 ఏళ్ల టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఈ సంవత్సరం ఒలింపిక్స్ గేమ్స్‌లో భారత దేశం తరపున పాల్గొనే అత్యంతపెద్ద వయస్సున్న వ్యక్తిగా నిలిచారు. ఈ ఏడాది హర్యానా రాష్ట్రం నుంచి అత్యధికంగా 24 మంది ఒలింపియన్లు ఉన్నారు. ఈ 24 మందిలో నీరజ్ చోప్రా కూడా ఒకరు. అంతేకాదు ఒలింపిక్స్ క్రీడల్లో భారత దేశం తరఫున ఐదుగురు ఒలింపిక్ పతక విజేతలు కనిపించబోతున్నారు. నీరజ్ చోప్రా, పీవీ సింధు, లవ్లీనా బరాగోహై, మీరాబాయి చాను, భారత హాకీ జట్టు మళ్లీ కనిపిస్తున్నారు.అయితే గత ఒలింపిక్స్ గేమ్స్ లో పాల్గొన్నవారి కంటే ఈసారి క్రీడాకారుల సంఖ్య తగ్గినా కూడా సాధించే పతకాల సంఖ్య మాత్రం పెరుగుతుందని అంతా అంచనా వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF